క‌ల‌లో కూడా అనుకోలేదు సార్..ఇందిర‌మ్మ ఇల్లు వ‌స్తుంద‌ని..

 ‘‘క‌ల‌లో కూడా అనుకోలేదు సార్..ఇందిర‌మ్మ ఇల్లు వ‌స్తుంద‌ని..


సిఎం గారిని తీసుకొని మా గృహ ప్ర‌వేశానికి మీరు రావాలి సార్..’’


ఇందిర‌మ్మ ఇండ్ల ల‌బ్దిదారులు, ఎంతో సంతోషంలో, అప్యాయతగా   నాతో మాట్లడిన మాటలివి..


     హైదరాబాద్ (ప్రజా అమరావతి);

         సోమ‌వారం నాడు స‌చివాల‌యంలోని కార్యాల‌యం నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఇందిర‌మ్మ ఇండ్ల ల‌బ్దిదారుల‌తో మాట్లాడి వారి మ‌నోగ‌తం తెలుసుకోవడం జరిగింది. సొంతింటి కల నెరవేరుతుందని వారి కళ్ళలో చూసిన ఆనందం నాకు ఎంతో తృప్తినిచ్చింది..రాష్ట్రంలోని ఇల్లు లేని ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వానికి..ల‌బ్దిదారుల‌ దీవెనలు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి.


పేద‌వాడి సొంతింటి క‌ల‌ను సాకారం చేయాల‌న్న ధ్యేయంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణ‌ప‌నులు మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా చురుకుగా సాగుతున్నాయి. త్వ‌ర‌లో గృహ ప్ర‌వేశాలు కూడా చేసుకుంటామని, ‘‘గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొని మీరు రావాలని‘‘ పేదింటి ఆడ‌ప‌డుచుల ఆహ్వానిస్తే.. వీలైన చోట్ల గృహ ప్ర‌వేశానికి వస్తాన‌ని వారికి చెప్పడం జరిగింది.


ఈనెల 19వ తేదీ సోమవారం నుంచి ఈ వారానికి సంబంధించి ల‌బ్దిదారుల‌కు 14.44 కోట్ల రూపాయిల‌ను ఈ సంద‌ర్బంగా విడుద‌ల చేయడం జరిగింది. ఇందిర‌మ్మ ఇండ్ల ప‌ధ‌కానికి సంబంధించి పైల‌ట్ ప్రాజెక్ట్ కింద 47,335 ఇండ్లు మంజూరు చేయ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు 7,824 ఇండ్లు బేస్‌మెంట్‌, 895 ఇండ్లు గోడ‌ల నిర్మాణం వ‌ర‌కు మ‌రో 64 ఇండ్లు శ్లాబ్ ల వ‌ర‌కు పూర్త‌య్యాయి.


గ‌త ప్ర‌భుత్వం చేసిన ఆర్ఢిక విధ్వంసం వ‌ల్ల రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పేదవారికి ఇచ్చిన మాట ప్ర‌కారం త‌ల తాక‌ట్టుపెట్ట‌యినా స‌రే  ప్ర‌తి సోమ‌వారం ల‌బ్దిదారుల‌కు నిధుల‌ను విడుద‌ల చేసితీరుతాం. ఒక్క రోజుకూడా ఇందిర‌మ్మ ల‌బ్దిదారుడు నిధుల కోసం ఎదురు చూడ‌కుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే జ‌మ‌చేస్తున్నాం.


రాష్ట్రంలో ఇంత‌వ‌ర‌కు 

బేస్మెంట్ పూర్తి అయిన 5,682 ఇండ్ల‌కు ల‌క్ష చొప్పున రూ. 56.82 కోట్లు, గోడ‌లు పూర్తి అయిన 497 ఇండ్ల‌కు 2ల‌క్ష‌ల చొప్పున రూ. 9.94 కోట్లు, 

స్లాబు పూర్త‌యిన 33 ఇండ్ల‌కు 4ల‌క్ష‌ల చొప్పున రూ. 1.32 కోట్లు 

విడుద‌ల చేశాం. మొత్తంగా ఇప్ప‌టివ‌ర‌కు ఇందిర‌మ్మ ఇండ్ల కోసం రూ. 68.08 కోట్లు అంద‌జేశాం.


గ‌త సోమ‌వారం మే 19 తేదీ నాటికి 

బేస్మెంట్ పూర్త‌యిన  5140 ఇండ్ల‌కు రూ. 51.40 కోట్లు అంద‌జేశాం, ఈరోజున 1072 ఇండ్ల‌కు రూ. 10.72 కోట్లు విడుద‌ల చేశాం.

దీంతో ఇంత‌వ‌ర‌కు బేస్మెంట్ పూర్త‌యిన 6212 ఇండ్లకు రూ.62.12 కోట్ల రూపాయిల‌ను ల‌బ్దిదారుల‌కు అంద‌జేయడం జరిగింది.


గ‌త సోమ‌వారం మే 19 తేదీ నాటికి  

గోడ‌లు పూర్త‌యిన ఇండ్ల‌కు సంబంధించి 224 ఇండ్ల‌కు రూ.2.24 కోట్లు విడుద‌ల చేయ‌గా ఈరోజు 306 ఇండ్ల‌కు రూ. 3.06 కోట్లు విడుద‌ల చేయడం జరిగింది. ఇక స్లాబులు పూర్త‌యిన 33 ఇండ్ల‌కు ఈ రోజున రూ.  0.66 కోట్లు విడుద‌ల చేశాం.


ఇందిర‌మ్మ గృహాల నిర్మాణంలో ప్ర‌భుత్వం యొక్క ప‌ర్య‌వేక్ష‌ణ ఉంటుందేత‌ప్ప నిర్మాణ బాధ్య‌త‌ల‌ను ప్ర‌భుత్వం చేప‌ట్ట‌డం లేదు. ల‌బ్దిదారులు త‌మ స్ధ‌లానికి అనుగుణంగా త‌మ‌కు ఇష్టమైన రీతిలో 400 చ‌ద‌ర‌పు అడుగుల‌కు త‌గ్గ‌కుండా, 600 చ‌ద‌ర‌పు అడుగుల‌కు మించ‌కుండా నిర్మించుకునే సౌల‌భ్యాన్ని క‌ల్పించ‌డం జ‌రిగింది. 


రాష్ట్రంలో దాదాపు 250 మండ‌లాల్లో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం జ‌రుగుతోంది, ల‌బ్దిదారుల‌కు ఇంజ‌నీర్లు నిర్మాణ ప‌నుల్లో త‌గు స‌హ‌కారాన్ని అందించాలి, వ‌ర్షాకాలంలో ఇబ్బంది ప‌డ‌కుండా ల‌బ్దిదారుల‌ను ప్రోత్స‌హించాలి.



Comments