రాష్ట్ర ముఖ్యమంత్రి నూతన సొంతింటి గృహ ప్రవేశం నకు హాజరైన అశేష ప్రజానీకం..
ఆత్మీయంగా,అభిమానం గా ప్రతి ఒక్కరిని పలకరిస్త అభివాదం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి దంపతులు...
కుప్పం,మే25 (ప్రజా అమరావతి):
.రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజక వర్గం శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ శివ పురం వద్ద నూతనంగా నిర్మించిన సొంతింటి గృహప్రవేశానికి కుప్పం నియోజక వర్గం నలు మూలల నుండి అశేష ప్రజానీకం హాజరై వారి అభిమానాన్ని చాటు కున్నారు..
కుప్పం ముద్దుబిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి,వీరి తనయుడు మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ వీరి శ్రీమతి నారా బ్రాహ్మణి లతో కలసి అంగరంగ వైభవంగా నూతన సొంతింటి గృహ ప్రవేశాన్ని కార్య క్రమాన్ని నిర్వహించారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం తో వేద పండితులచే హోమం నిర్వహించి శాస్రోత్తంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి దంపతులు, నారా లోకేష్ దంపతులునిర్వహించారు.
ఈ నూతన సొంతింటి గృహప్రవేశ కార్యక్రమానికి కుప్పం నియోజకవర్గం ప్రజలను ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది..
ముఖ్యమంత్రి దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన అశేష ప్రజానీకం.
ముఖ్యమంత్రి కుటుంబం ఆహ్వానం మేరకు ప్రతి ఒక్కరూ వారి వారి కుటుంబ సభ్యులతో కలిసి వారింటి గృహప్రవేశంగా భావించి వచ్చి ముఖ్య మంత్రి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దంపతులు ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ అభిమానంగామాట్లాడుతూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి దంపతులు స్వయాన అంత అభిమానం చూపడంతో గృహప్రవేశానికి వచ్చిన ఆశేష ప్రజానీకం సంతోషం వ్యక్తం చేశారు..
వచ్చిన అశేష ప్రజానీకం ముఖ్యమంత్రి దంపతులతో ఫోటోలు దిగడం మరపురాని జ్ఞాపకంగా వారి హృదయాలలో నిలుపుకున్నారు.
ప్రజలు ప్రస్తావించిన సమస్యలనుపరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్,జిల్లా జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి, కడా పిడి వికాస్ మర్మత్, డి.ఎఫ్.ఓ భరణి,లను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ముఖ్యమంత్రి నూతన సొంతింటి వద్ద భద్రతా ఏర్పాట్లు ను అనంతపురం రేంజ్ డిఐజి షిమోషి,జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పర్యవేక్షించారు..
యువ కిరణం, ముఖ్యమంత్రి తనయుడు, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తో సెల్ఫీలు దిగేందుకు క్యూ కట్టిన యువత, మహిళలు..
నూతన సొంతింటి గృహప్రవేశానికి వచ్చిన అశేష ప్రజానీకం లో ఎక్కువ భాగం మహిళలు ముఖ్యమంత్రి దంపతులకు అభివాదం చేసినప్పటికీ ఫోటోలు దిగినప్పటికీ యువకిరణం ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.
వారి అభిమానాన్ని తెలుసుకున్న యువనేత వారి సెల్ ఫోన్ లో సెల్ఫీలు తీసి ఇవ్వడం యువతకు, మహిళలకు మరింత ఆనందాన్ని కల్పించింది.
ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ముఖ్యమంత్రి సొంత ఇంటి గృహప్రవేశ ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు.
ముఖ్యమంత్రి నూతన సొంత గృహ ప్రవేశ కార్యక్రమానికి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు,ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు జీడీ నెల్లూరు శాసనసభ్యులు వి.ఎం. థామస్ , పలమనేరు,చిత్తూరు, పూతలపట్టు,నగరి, చంద్రగిరి,తిరుపతి శాసన సభ్యులు ఎన్.అమర నాథ్ రెడ్డి,గురజాల జగన్మోహన్, కే.మురళీ మోహన్,గాలి బాను ప్రకాష్, పులివర్తి నాని,ఆరణి శ్రీనివాసులు, చుడా చైర్ పర్సన్ కటారి హేమలత,రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, మాజీ ఎమ్మెల్సీ లు,ఎం ఎల్ ఏ లు దొరబాబు, గౌనివాని శ్రీనివాసులు, సీకే బాబు,నాయకులు డాక్టర్ సురేష్ బాబు,రాజ్ కుమార్,శ్రీధర్ వర్మ, ప్రజా ప్రతి నిధులు,పెద్ద ఎత్తున కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ప్రసాదాలను అందజేసిన ఆలయ ఈఓ వేద పండితులు.
ముఖ్యమంత్రి సొంత ఇంటి గృహప్రవేశం ఉన్న పురస్కరించుకొని శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ప్రసాదాలను పూతలపట్టు శాసన సభ్యులు కే.మురళి మోహన్,ఆలయ ఈవో పెంచల కిషోర్, వేద పండితులు ముఖ్యమంత్రి గారికి అందజేశారు. అనంతరం వేదపండితులు ఆశీర్వాదం చేశారు.
కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మవారి ఫోటోను ముఖ్యమంత్రి దంపతులకు బహుకరించిన ఆలయ చైర్మన్.
నూతన సొంత ఇంటి గృహప్రవేశం అనంతరం ప్రజలను కలుస్తున్న ముఖ్యమంత్రి దంపతులకు కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మవారి ఫోటోను ఆలయ చైర్మన్ రవిచంద్రబాబు ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దంపతులు నూతన సొంతింటిలో రాత్రికి బస చేయనున్నారు.
addComments
Post a Comment