విజయవాడ (ప్రజా అమరావతి);
*- ఆలపాటి సురేష్ కుమార్, చైర్మన్, సి. రాఘవాచారి మీడియా అకాడమి*
దేశంలో, రాష్ట్రంలో విలువలతో కూడిని జర్నలిజాన్నిప్రోత్సహించాలని సి. రాఘవాచారి మీడియా అకాడమి చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ తెలిపారు. మొఘల్ రాజ పురంలోని సి. రాఘవాచారి మీడియా అకాడమి కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ మీడియాలో నైతిక విలువలు చాలా ముఖ్యమని ఎవరికి వారు ఆ విలువలను పాటిస్తే సమస్యలు రావన్నారు. కొందరు అనైతిక జర్నలిజాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. శుక్రవారం మీడియా చానెల్ చర్చాగోష్టిలో కృష్ణంరాజు పాల్గొంటూ చేసిన వ్యాఖ్యలు సందర్భోచితం కాదన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిని దేవతల రాజధాని అన్న మాటలను కృష్ణం రాజు కించపరుస్తూ మాట్లాడారన్నారు. అమరావతిని వేశ్యల రాజధాని అని మాట్లాడం సమంజసం కాదన్నారు. సంబంధిత ఛానల్ డిబేట్ లో రాజధాని మహిళలను కించ పరుస్తూ మాట్లాడం సమంజసం కాదన్నారు. అసలు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో వచ్చిన వార్తలో కొన్ని రాష్ట్రాల్లో సెక్స్ వర్కర్స్ ఎక్కువన్న వార్త వచ్చింది కాని అమరావతి పేరు లేదన్నారు.
జర్నలిజంలో సందర్భం చాలా ముఖ్యమైందని, సందర్భం లేకుండా మాట్లాడారంటే ముందస్తు పథకంలో భాగంగా ఈ వ్యవహారం నడిచినట్లు అర్ధమౌతుందన్నారు. ఆ ప్రాంత వాసులకు కోపం వచ్చిన సందర్భంగా సమస్య తీవ్రమైందన్నారు. ఎవరు రాజకీయాలు జోడించాలో తెలుసుకోవాల్సిన పరిస్థితి పౌర సమాజంపై ఉందన్నారు. చర్చ నిర్వహించిన వ్యక్తి చానెల్ మేనేజ్ మెంట్ కు క్షమాపణలు చెపుతామంటున్నారు.. ఆ మీడియాని నడుపుతున్న వాళ్లు ఓ రాజకీయ పార్టీని కూడా నడుపుతున్నారని, వారు పౌర సమాజానికి వ్యతిరేకంగా ఉంటారన్నారు. రాజకీయ పార్టీని నడిపే వ్యక్తులు మీడియాని నడిపితే, అందులో పనిచేసే ఉద్యోగులు ఆ వ్యక్తుల కోసం పనిచేస్తారు కాని, సమాజం కోసం పనిచేయరన్నారు. అందుకే పరిస్థితులు ఇలా ఉన్నాయని, అది సమాజానికి నష్టమన్నారు. సమాజానికి మేలు చేసే మీడియా ప్రజలకు కావాలన్నారు. దేశంలో, రాష్ట్రంలో ప్రజా హితంగా మీడియా ఏవిధంగా ఉండాలో, ఏవిధంగా ఉండకూడదో తెలిపే లా చర్చ ఉండాలన్నారు. రాజకీయ పార్టీలు నడిపే మీడియాపై చర్చ జరగాలని, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో చర్చలు జరిపితేనే మంచీ, చెడులకు తేడా తెలుస్తుందన్నారు. దేశంలో, రాష్ట్రంలో మీడియా అకాడమీ దీనికి వేదికగా ఉంటుందన్నారు. ఆ చర్చలను లాజికల్ గా ఒక ముగింపుకు తీసుకెళదామన్నారు. జరిగిన డిబేట్ ను ఇంటర్నెట్ నుంచి డిలీట్ చేయాలని, తీసివేసినట్లు ఒక ప్రకటన ఇవ్వాలని ఆ మీడియా యాజమాన్యానికి తెలియజేస్తున్నానన్నారు.
రాజకీయ పార్టీలు నడుపుతూ అదే చేతితో మీడియా నడిపే వారి నుంచి నిజాయితీ ఆశించలేమన్నారు. ఆ మీడియా యజమాని ప్రయోజనాల కోసం పనిచేస్తుంది కానీ ప్రజా ప్రయోజనాల కోసం కాదన్నారు. ఇతర మీడియా సంస్థలనూ, ఇలాంటి రాజకీయ కుటుంబాలు నడిపే మీడియా సంస్థలనూ ఒకే గాటన కట్టడం కుదరదన్నారు. యజమాని తిరిగి అధికారంలోకి రావడం లక్ష్యంగా వార్తలు ఇచ్చే మీడియా ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగానే వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి అనైతిక జర్నలిజాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉందని చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ తెలియజేశారు.
addComments
Post a Comment