– కూటమి మోసాల్ని ఎండకట్టేందుకే నిరసన అంటూ వెల్లడి
– జూన్ –4న వెన్నుపోటు దినం పేరుతో చిలకలూరిపేట పట్టణంలో భారీ ర్యాలీ
– ప్రజలతో కలిసి అధికారులకు వినతి పత్రాల సమర్పణ
– పార్టీ శ్రేణులతో కలిసి కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ
చిలకలూరిపేట (ప్రజా అమరావతి);
చిలకలూరిపేట నియోజకవర్గంలో జూన్ 4వ తేదీన వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరగనున్న ‘వెన్నుపోటు దినం‘ కార్యక్రమ పోస్టర్‌ను పార్టీశ్రేణులతో కలిసి మాజీ మంత్రివర్యులు విడదల రజిని గారు వారి నివాసంలో ఆవిష్కరించారు. ప్రజల మద్దతుతో జరిగే ఈ నిరసన ర్యాలీను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ నాయకులకు కార్యక్రమ నిర్వహణపై దిశానిర్ధేశం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు విడదల రజిని గారు మాట్లాడుతూ
365 రోజుల్లో ఒక్కహామీ నెరవేర్చని ప్రభుత్వం...
2024 జూన్ 4న అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ‘సూపర్‌సిక్స్’ తో పాటు మరో 143 హామీలు ఇచ్చిన చంద్రబాబు, ఏడాది గడిచినా ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదని అన్నారు.
అధికారంలోకి వచ్చాక వైఎస్సార్సీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని కుట్రలు పన్నుతున్నారని, రాష్ట్రంలో శాంతిభద్రతలు గల్లంతవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు, ప్రభుత్వం శాశ్వతం కాదని..ప్రజల తీర్పే శాశ్వతం అవుతుందన్నారు.
వెన్నుపోటు దినం – ప్రజా గళానికి వేదిక
‘జూన్ 4న జరగనున్న ’వెన్నుపోటు దినం’ కేవలం నిరసన కార్యక్రమం కాదని, అది హామీలను నెరవేర్చని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రజల గళం,‘ అని పేర్కొన్నారు. హామీల అమలుపై కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి లక్ష్యంగా వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాబట్టి పట్టణంతో పాటు నియోజకవర్గంలోని మూడు మండలాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి విడదల రజిని గారు పిలుపునిచ్చారు.
addComments
Post a Comment