జిల్లాకు ఆయుష్మాన్ ఉత్కృష్ట పురస్కార్



*జిల్లాకు ఆయుష్మాన్ ఉత్కృష్ట పురస్కార్


*


పార్వతీపురం, సెప్టెంబర్ 29 (ప్రజా అమరావతి): పార్వతీపురం మన్యం జిల్లా ఆయుష్మాన్ ఉత్కృష్ట పురస్కార్ కు ఎంపిక అయ్యింది. జాతీయ ఆరోగ్య అధీకృత సంస్థ ఆరోగ్య మంతన్ 2022 క్రింద ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ లో భాగంగా 2022 ఆగస్టు 1వ తేదీ నుండి సెప్టెంబర్ 19వ తేదీ వరకు జరిగిన కార్యక్రమాలకు ఈ పురస్కారం దక్కింది. దేశంలో ఎంపిక అయిన జిల్లాగా పార్వతీపురం మన్యం జిల్లా నిలిచింది.  


జాతీయ ఆరోగ్య అధీకృత సంస్థ (నేషనల్ హెల్త్ అథారిటీ) ప్రకటించిన ఉత్తమ రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్ నిలవగా జిల్లాలో పార్వతీపురం మన్యం నిలిచింది. 


ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ఎన్.బి.హెచ్.ఏ) లో భాగంగా ప్రతి ఒక్కరికీ 14 అంకెల ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రత్యేక సంఖ్య దేశంలో ఎక్కడకు వెళ్లి వైద్యం చేసుకున్నా తన ఆరోగ్య చరిత్ర తెలియజేస్తుంది. గర్భిణీలు సంపూర్ణ పోషణ కిట్లు పొందుతున్నారా? లేదా అనే అంశాన్ని కూడా పర్యవేక్షణ చేయుటకు ఉపయోగ పడుతుంది. 


జిల్లాకు అవార్డు రావడం పట్ల జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. జిల్లాను అన్ని రంగాల్లో ఉత్తమ స్థానంలో ఉండుటకు శాయశక్తులా కృషి చేస్తున్నామని తెలిపారు. హెల్త్ అకౌంట్ అనుసంధానం చేసిన సిబ్బందిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో అన్ని కార్యక్రమాలు దిగ్విజయం చేయాలని కోరారు.

Comments