జిల్లాలో జగనన్న విద్యాదీవేన క్రింద 42411 మంది విద్యార్థులకు చెందిన 38099 మంది తల్లుల ఖాతాలకు రూ.24,66,18,443 కోట్లుజమ.

 జిల్లాలో జగనన్న విద్యాదీవేన క్రింద 42411 మంది విద్యార్థులకు చెందిన 38099 మంది తల్లుల ఖాతాలకు రూ.24,66,18,443  కోట్లుజమ.

జిల్లా సంయుక్త కలెక్టర్ టీఎస్ చేతన్
పుట్టపర్తి, నవంబర్ 30 (ప్రజా అమరావతి):-


జిల్లాలో జగనన్న విద్యాదీవేన క్రింద 42411 మంది విద్యార్థులకు చెందిన 38099 మంది తల్లుల ఖాతాలకు రూ.24,66,18,443  కోట్లు  రాష్ట్ర ముఖ్యమంత్రిజమ చేశారనిజిల్లా సంయుక్త కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు.బుధవారం అన్నమయ్య జిల్లా మదనపల్లి బహిరంగ సభ వేదిక నుంచి 4వ విడత జగనన్న విద్యా దీవెన పథకం సంబంధించి 2022 జులై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి ప్రారంభించే కార్యక్రమాన్ని స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా  సంయుక్త కలెక్టర్ టీఎస్  చేతన్ వీక్షించారు.* 


*ఈ సందర్భంగా జిల్లా  సంయుక్త కలెక్టర్  మాట్లాడుతూ జిల్లాలో పేద విద్యార్థులు ఉన్నత* *చదువులకు దూరం కాకూడదన్న ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యా జీవన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు. చదువుల ఖర్చుతో తల్లిదండ్రులు* *అప్పులపాలు కాకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజుల మొత్తాలను నేరుగా రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తోందన్నారు. ఈ పథకం కింద ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే అర్హులైన పేద విద్యార్థులు కళాశాలలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోందన్నారు. కాలేజీల్లో జవాబుదారీతనం పెరిగేలా, విద్యార్థుల తల్లులకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ, తల్లుల సాధికారతకు పట్టం కడుతూ  నేరుగా వారి ఖాతాల్లోనే రాష్ట్ర జమ చేస్తోందన్నారు.పాఠశాల స్థాయి నుంచి మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉన్నత ప్రమాణాలతో విద్యార్థులకు అన్ని విధాల ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థలో  గతంలో ఎన్నడు లేని విధంగా అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొని వచ్చిందని, విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ విద్యను ఉచితంగా అందించడమే కాకుండా అమ్మ ఒడి ,నాడు- నేడు, ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు విద్య దీవెన, వసతి దీవెన తదితర పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. సచివాలయాల ద్వారా అర్హులను గుర్తించడంమే కాకుండా సోషల్ ఆడిట్ విధానంతో పారదర్శకంగా పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు. అర్హత కలిగిన ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదివి బంగారు భవిష్యత్తును పొందాలన్నదే ప్రభుత్వ  ధ్యేయమన్నారు. ప్రస్తుతం జగనన్న విద్యా దీవెన ద్వారా పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చేరాలన్న లక్ష్యంతో  ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.  జగనన్న విద్య దీవెన కు సంబంధించి ఏవైనా అపోహలు, సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవచ్చునని సూచించారు.జిల్లాలోని 42,411 మంది ఎస్సీ, ఎస్టీ ,బీసీ, కాపు ఈ బీసీ క్రిస్టియన్,  మైనారిటీ  విద్యార్థులకు  సంబంధించి  నేరుగా  38099 మంది తల్లుల ఖాతాల్లోకి చెక్కు రూపంలో సుమారు రూ.24.66 లు జమ చేయడం జరుగుతున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుంగ ఓబులేసు, జిల్లా అగ్రి అడ్వైజరీ బోర్డు చైర్మన్ అవుటాల రమణారెడ్డి, ఎంపీపీ ఏవి రమణారెడ్డి, పుడా చైర్మన్ లక్ష్మీనరసమ్మ, జిల్లా  సాంఘిక సంక్షేమ అధికారి శివ రంగ ప్రసాద్, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి నిర్మల జ్యోతి, డిటిడబ్ల్యూ మోహన్ రామ్, వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.


Comments