ఈ నెల 9 న ప్రచురితమైన ఓటరు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను అత్యంత జాగ్రత్తగా పరిశీలించాలి


నెల్లూరు  నవంబర్ 28 (ప్రజా అమరావతి)



ఈ నెల 9 న ప్రచురితమైన ఓటరు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను అత్యంత జాగ్రత్తగా పరిశీలించాలని ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్,ఎపి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యండి ఎస్ సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు.


సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఇ ఆర్ ఓ లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమ్మరీ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రోరల్ రోల్స్ పై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.


ఈ సందర్బంగా ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ మాట్లాడుతూ డిసెంబర్ 3,4 తేదీలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని, ఇందులో జనాభా,  ఓటరు జాబితా నిష్పత్తి సరిపోల్చి పగడ్బoదీగా తయారు చేయాలని సూచించారు. యువ ఓటర్ల పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. చనిపోయిన వారిని ఓటరు జాబితా నుండి తొలగించే విషయంలో పద్దతి ప్రకారం నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఓటరు కార్డుకు ఆధార్ కార్డు అనుసంధాన ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయుటలో అధికారులు శ్రద్ద వహించాలన్నారు. ఫారం 6, 7, 8 లకు సంబంధించి నోటీసు బోర్డులో ఉంచి, బి ఎల్ ఓ ల వారీగా చర్యలు తీసుకోవలసిందిగా సూచించారు.


ఈ సమావేశంలో శాసన మండలి సభ్యులు విఠపు బాలసుభ్రహ్మణ్యం, జిల్లా జాయింట్ కలెక్టర్ రోణంకి కుర్మనాధ్, నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ హరిత, కందుకూరు సబ్ కలెక్టర్ ఎస్ ఎస్ శోభిక, డి ఆర్ ఓ వెంకట నారాయణమ్మ, నెల్లూరు, కావలి, ఆత్మకూరు ఆర్ డి ఓ లు మాలోల, శీనా నాయక్, కరుణ కుమారి, జెడ్పి సి ఇ ఓ చిరంజీవి, డ్వామా పిడి వెంకట్రావు, టి జి పి స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ సుధాకర్, వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులు వై ఎస్ ఆర్ పార్టీ - మురళీధర్ రెడ్డి, టిడిపి - వెంకటేశ్వర రెడ్డి, కాంగ్రెస్ - బాల సుధాకర్, బి జె పి - కాళేశ్వర రావు, సి పి యం - మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.



Comments