తూర్పు గోదావరి జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకుడు డా పి.భాస్కర్ పర్యటన




 రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);



 తూర్పు గోదావరి జిల్లా  ఓటర్ల జాబితా పరిశీలకుడు డా పి.భాస్కర్ పర్యటన



రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో బుధవారం సమావేశం


... కలెక్టర్ డా కె. మాధవీలత 



 భారత ఎన్నికల సంఘం వారు ది 01.01.2023 అర్హత తేదీగా ఫోటో ఎలక్టోరల్ రోల్స్ యొక్క ప్రత్యేక సారాంశ సవరణకు సంబంధించిన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపారు.



"ఎలెక్టోరల్ రోల్ అబ్జర్వర్"గా తూర్పు గోదావరి జిల్లాకు   డా.పి.భాస్కర్,  కమీషనర్, కళాశాల విద్య వారిని నియమించియున్నారు.  రివిజన్ పూర్తయ్యే వరకు ఆ అధికారుల సేవలను రోల్ అబ్జర్వర్ గా  అందుబాటులో ఉంచాలని కూడా భారత ఎన్నికల సంఘం వారు తెలియజేసియున్నారు.భారత ఎన్నికల సంఘం  సదరు పై తెల్పిన " ఎలెక్టోరల్ రోల్ అబ్జర్వర్"వారికి ఈక్రింది విధంగా సందర్శన షెడ్యూల్ ను కేటాయించియున్నారు.

సందర్శన షెడ్యూల్

i)   క్లెయిమ్‌లు మరియు అభ్యంతరాల స్వీకరణ వ్యవధిలో (09.11.2022 నుండి     

     08.12.2022 వరకు)


ii)  EROల ద్వారా క్లెయిమ్‌లు మరియు అభ్యంతరాలను పరిష్కరించే వ్యవధిలో    

     (09.12.2022 నుండి 26.12.2022 వరకు)


iii) BLOల ద్వారా వర్కింగ్ కాపీని ధృవీకరించే సమయంలో/ సప్లిమెంట్‌ల ప్రింటింగ్  మరియు రోల్ చివరి ప్రచురణ (27.12.2022 నుండి 04.01.2023 వరకు)


  

 భారత ఎన్నికల సంఘం వారు తెలియచేసిన "ఎలెక్టోరల్ రోల్ అబ్జర్వర్" వారి సందర్శన షెడ్యూల్ ప్రకారం, వారు తూర్పు గోదావరి జిల్లాను  ది.16.11.2022 న సందర్శించుచున్నారు.



 కావున, పై తెలిపిన షెడ్యూల్ నందలి విషయముల పై చర్చించు నిమిత్తం ది.16.11.2022 న మధ్యాహ్నం 12.00 గంటలకు  "ఎలెక్టోరల్ రోల్ అబ్జర్వర్" చే, జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం, తూర్పు గోదావరి జిల్లా,  బొమ్మూరు రాజమహేంద్రవరం రూరల్ నందు జిల్లాకు సంబంధించిన గౌరవ పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మరియు ఓటరు నమోదు అధికారులు (ERO) అందరితో సమావేశం నిర్వహించ నున్న దృష్ట్యా సదరు సమావేశమునకు హాజరు కావలసినదిగా కలెక్టర్ కోరియున్నారు.


Comments