ఫిష్ ఆంధ్రా.. ఫిట్ ఆంధ్రా .. ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేపట్టాలి ..కలెక్టర్ మాధవీలత



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 


** మత్స్యకారుల ఆర్థిక జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టింది.


** ఫిష్ ఆంధ్రా.. ఫిట్ ఆంధ్రా .. ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేపట్టాలి


..కలెక్టర్ మాధవీలత 


జిల్లాలో మత్స్యకారుల ఆర్థిక జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అన్నారు.

  అంతర్జాతీయ మత్స్య దినోత్సవ వేడుకలను పుష్కరించుకొని సోమవారం స్థానిక పుష్కర్ ఘాట్ లో రుడా చైర్ పర్సన్ షర్మిలా రెడ్డి,స్థానిక ప్రజా ప్రతినిధులు జక్కంపూడి విజయలక్ష్మి, మత్స్య అధికారులతో కలసి గోదావరి నదిలో చేప పిల్లలను వదిలారు. ఈ  సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ  చేపలవేట జీవనధారంగా జిల్లాలో 20 వేల కుటుంబాలు గోదావరి నదిపై ఆధారపడగా, మరో 10 వేల మంది మత్స్యకారులు చేపల ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తూ జీవిస్తున్నారన్నారు.  ప్రకృతి సహజసిద్ధంగా గోదావరి నాదీ జలాలు మన జిల్లాలో ఉండటం అదృష్టమన్నారు. ప్రతి మత్స్యకారుడు ఆర్థికపరమైన జీవనోపాదికి గోదావరి ఎంతో దోహద పడుతుందన్నారు.  జిల్లాలో పంచాయితీ, మైనర్ ఇరిగేషన్ చెరువులు ద్వారా ఆక్వా కల్చర్ సాగు చేస్తున్న రైతులు గోదావరి జలాలను వినియోగించుకోవాలన్నారు. ఆక్వా సాగు రైతులకు, మత్సకారుల ఆర్ధికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ప్రవేశపెట్టిందని వాటిని చేసుకోవాలని కలెక్టర్ నిలుపునిచ్చారు. చేపల ఉత్పత్తులు ఎగుమతులపై ఆధారపడటం  కంటే స్థానికంగా వినియోగించడం వల్ల మరింత ఆర్థికాభివృద్ధి జరుగుతుందని,రాష్ట్ర ముఖ్యమంత్రి ఆక్వా కల్చర్ అభివృద్దికి అనేక కార్యక్రమాలు ప్రవేశ పెట్టడంజరిగిందన్నారు. మత్య్సకారులకు వ్యాపారాలకు రుణ సౌకర్యం, మోటారు వాహనాలు అందిస్తున్నారన్నారు. స్థానికంగా చేపల వినియోగాన్ని పెంచడం,  ఎగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి మినీ ఫిష్ రిటైల్ అవుట్‌లెట్‌లకు ప్రోత్సహం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అన్నారు. ఫిష్ ఆంధ్రా - ఫిట్ ఆంధ్ర ఫ్లాగ్‌షిప్" కార్యక్రమం కింద రాష్ట్రంలో డొస్టిక్ మార్కెటింగ్‌ను ప్రోత్సహించడంజరగాలని స్పష్టం చేశారు.

  ఈ రోజు గోదావరి నదిలో వదిలిన చేప పిల్లలు మరో ఆరు మాసాల్లో ఎదుగుతాయని వాటిని ఈ ప్రాంతం మత్య్సకారులకు ఎంతో దోహదపడతాయన్నారు. జిల్లాలో మత్స్య సంపద కు అనుకూలమైన పరిస్థితి ఉన్న ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు సక్రమంగా అమలు చేయడం తో పాటు మరిన్ని యూనిట్స్ ఏర్పాటుకు జిల్లాకు కేటాయించిన లక్ష్యాలు చేరుకోవాల్సి ఉంటుందన్నారు.  స్థానిక జాం పేట్ మార్కెట్ లో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ది చేసేందుకు చర్యలు చేపడతామని కలెక్టరు తెలిపారు. 

ఈ సందర్భంగా  కలెక్టరు కడియం చేప పిల్లల ఉత్పత్తుత్తి కేంద్రంలో తయారు  చేసిన 22,41,000 చేప పిల్లలను గోదావరి నదిలో వదిలారు. మినీఫిష్ వెండింగ్ రూ.3 లక్షల విలువ గల 25 యూనిట్లను, రూ. 50 లక్షల విలువ గల ఒక యూనిట్  లబ్దిదారులుకు జిల్లా  కలెక్టరు చేతుల మీదుగా  మంజూరు పత్రాలను అందజేశారు. 


రుడా చైర్ పర్సన్ షర్మిళ రెడ్డి మాట్లాడుతూ మత్స్యకారుల ఆర్ధికాభివృద్ధికి  రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలను ప్రవేశ పెట్టారని లబ్దిదారులు వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 


జిల్లా మత్స్య అధికారి వి. కృష్ణా రావు మాట్లాడుతూ  జిల్లాలో  2020-21, 21-22 సంవత్సరాలలో తొమ్మిది పథకాల కింద యూనిట్స్ ఏర్పాటు చేస్తుండగా, 2022-23 లో 12 పథకాలకు సంబంధించిన పరిపాలన ఆమోదం ఇస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే క్షేత్ర స్థాయి లో, ఈ రంగంలో ప్రముఖ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, రైతులతో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మండల, డివిజన్ స్థాయి లో వచ్చిన ధరకాస్తు లను జిల్లా స్థాయి లో స్క్రూటిని చేసి తగిన సిఫార్సులు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


ఈ సమావేశంలో జిల్లా మత్స్య అధికారి వి. కృష్ణా రావు, స్థానిక నాయకులు జక్కంపూడి విజయలక్ష్మి మత్య్సశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments