గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే కోసం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ

 *గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే కోసం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), నవంబర్ 26 (ప్రజా అమరావతి): 


బెంగళూరు - కడప - విజయవాడ నగరాల మధ్య ఏర్పాటు చేస్తున్న గ్రీన్ ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్ ఎకనామిక్ కారిడార్ కింద ప్యాకేజీ -1, ఎన్ హెచ్ 44 పనులు చేపట్టేందుకోసం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం జరిగింది. శనివారం పుట్టపర్తి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే కోసం ఇన్చార్జి డిఆర్ఓ భాగ్యలక్ష్మి, ఏపీపీసీబీ ఎన్విరాన్మెంటల్ అధికారి శంకర్రావు, ఎన్హెచ్ఎఐ ఎన్విరాన్మెంటల్ ఇంచార్జి కరిముల్లా, తదితరులు స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, ప్రజలతో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు.


ఈ సందర్భంగా ఏపీపీసీబీ ఎన్విరాన్మెంటల్ అధికారి శంకర్రావు మాట్లాడుతూ గ్రీన్ ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్ ఎకనామిక్ కారిడార్ కింద ప్యాకేజీ -1, ఎన్ హెచ్ 44 పనులు చేపట్టేందుకోసం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం జరిగిందని, ఇందులో ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రైతులు తమ అభిప్రాయాలను తెలియజేయడం జరిగిందన్నారు. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్సెస్ వే కింద అండర్ పాస్ ల నిర్మాణం, పొల్యూషన్ వల్ల పంటలు నష్టపోవడం, ఇతర అంశాలపై వారు అభిప్రాయాలను తెలియజేశారని, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రైతులు తెలియజేసిన అభిప్రాయాలను వీడియో రూపంలో రికార్డ్ చేయడం జరిగిందన్నారు. అన్ని వివరాలను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించడం జరుగుతుందని, వారు తదుపరి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు.


బెంగళూరు - కడప - విజయవాడ నగరాల మధ్య ఏర్పాటు చేస్తున్న గ్రీన్ ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్ ఎకనామిక్ కారిడార్ కింద ప్యాకేజీ -1, ఎన్ హెచ్ 44 పనులు జిల్లాలోని కోడూరు గ్రామంలో ప్రారంభమవుతుండగా, కొత్తపల్లి గ్రామం సమీపంలో రహదారు ముగుస్తుంది.


అంతకుముందు పలువు రైతులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. రైతులు మాట్లాడుతూ గ్రీన్ఫీల్డ్ ఎక్స్సెస్ వే ప్రాజెక్టు రావడం చాలా సంతోషకరమన్నారు. ఇందుకోసం తమ భూమి అంతా వెళ్ళిపోతుందని, తాము ఎక్కడికి వలస పోయే పరిస్థితి లేదని, తమకు ఏదైనా పని కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.Comments