రేలంగి రాజేష్ కు మూడు చక్రాల సైకిల్ అందచేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);



రేలంగి రాజేష్ కు మూడు చక్రాల సైకిల్ అందచేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి


ఆదివారం నాడు జరిగిన నల్సా ర్యాలీ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి పి. వెంకట జ్యోతిర్మయి ఇచ్చిన హామీ ని నెరవేర్చే దిశలో మంగళవారం మధ్యాహ్నం రేలంగి రమేష్ కు మూడు చక్రాల సైకిల్ స్థానిక కోర్టు ఆవరణలో అందచేశారు.


ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు శ్రీమతి పి . వెంకట జ్యోతిర్మయి  మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలకు, అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయడం లో డి ఎల్ ఎస్ ఏ నిబద్దత తో కూడి సేవా భావంతో న్యాయ సేవలు అందించెందుకు ఎప్పుడు ముందు ఉంటుందని తెలిపారు. ఎటువంటి ఆధారం లేని రేలంగి రమేష్ యొక్క విజ్ఞప్తి ని పరిగణన లోకి తీసుకుని మూడు చక్రాల సైకిల్ అందించడం జరుగుతొందని అన్నారు.


ఈ సందర్భంగా రేలంగి రమేష్ మాట్లాడుతూ, ఆదివారం జడ్జి మేడం గారు స్వయంగా తన వద్దకు వచ్చి నా సమస్య విని, ఆ మేరకు మూడు చక్రాల సైకిల్ అందచేశారు. తనకు భార్య, పిల్లలు లేరని, ఎటువంటి ఆసరా లేదని, ఆధార్ కార్డు కూడా పోయిందని తెలియచేశానని, మంగళవారం మూడు చక్రాల సైకిల్ ఇస్తామని చెప్పి, సోమవారం నా వద్ద కు మనిషిని పంపి వివరాలు తెలుసుకుని, ఈరోజు సైకిల్ ఇవ్వడం జరిగిందని, వారి పెద్ద మనస్సుకి కృతజ్ఞత తెలియచేస్తున్నట్లు రాజేష్ అన్నారు. మనకు డి ఎల్ ఎస్ ఏ ఉండగా దిగులు ఎందుకు దండగ అనే నినాదాన్ని రమేష్ పేర్కొన్నారు. 


దేవిచౌక్ వద్ద జీవనం సాగిస్తున్న రేలంగి రాజేష్ అనే వ్యక్తి తాను నడవలేక నిలబడలేక ఇబ్బంది పడుతున్నానని మూడు చక్రాల సైకిల్ కోసం కోరగా, స్పందించిన  జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. వెంకట జ్యోతిర్మయి మంగళవారం నాటికి మూడు చక్రాల సైకిల్ అందిస్తానని హామీ ఇచ్చి  తక్షణం వివరాలు సేకరించడం జరిగింది.


ఈ కార్యక్రమంలో డి ఎల్ ఎస్ ఏ కార్యదర్శి కె. ప్రత్యూష కుమారి, న్యాయ వాదులు తదితరులు పాల్గొన్నారు.



Comments