ఇదేం ఖర్మ" కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా నిర్వహిస్తాం *- "ఇదేం ఖర్మ" కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా నిర్వహిస్తాం


 *- రాష్ట్ర ప్రజలు దారుణంగా మోసపోయారు* 

*- రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టొద్దు* 

*- టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్* అమరావతి, నవంబర్ 19 (ప్రజా అమరావతి): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రారంభించిన "ఇదేం ఖర్మ" కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తామని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ చెప్పారు. శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో శిష్ట్లా లోహిత్ పాల్గొన్నారు. ముందుగా సమావేశానికి వెళ్తున్న చంద్రబాబును శిష్ట్లా లోహిత్ కలిసి అభివాదం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ రివర్స్ పాలనపై తెలుగుదేశం పార్టీ "ఇదేం ఖర్మ" కార్యక్రమాన్ని చేపట్టనుందని చంద్రబాబు తెలిపారు. "ఇదేం ఖర్మ" కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు దిశా నిర్ధేశం చేశారు. అనంతరం శిష్ట్లా లోహిత్ మాట్లాడుతూ "ఇదేం ఖర్మ" కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకుని నిర్వహించడం ద్వారా ప్రజల్లో మరింత చైతన్యం తీసుకువస్తామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారంలోకి వచ్చినప్పుడు మరో విధంగా మాట్లాడుతున్నారన్నారు. జగన్ మాటలు నమ్మి రాష్ట్ర ప్రజలు దారుణంగా మోసపోయారన్నారు. ప్రభుత్వ అద్వాన్న పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. రాష్ట్రంలో కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టవద్దన్నారు. రాష్ట్రంలో టీడీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతూ వస్తోందన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రారంభించామన్నారు. ప్రజలను చైతన్య పర్చడంలో తెలుగుదేశం పార్టీ మంచి ఫలితాలను సాధించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు చేపట్టిన జిల్లాల పర్యటనకు అనూహ్య స్పందన వస్తోందన్నారు. దీన్ని చూసి ఓర్వలేక చంద్రబాబుపై రాళ్ళ దాడులకు పాల్పడుతున్నారన్నారు. గత మూడు రోజులుగా నిర్వహించిన కర్నూల్ జిల్లా పర్యటన పూర్తిస్థాయిలో విజయవంతమైందన్నారు. చంద్రబాబు రోడ్ షోలకు ఎన్నడూ లేనంతగా ప్రజలు తరలివచ్చి సంఘీభావం తెలిపారన్నారు. ఒకే రాజధాని అమరావతి కావాలని కర్నూల్ జిల్లా ప్రజలు చాటి చెప్పారన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారన్నారు. ప్రభుత్వం చేస్తున్న అక్రమ దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొంటామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం తథ్యమన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన చంద్రబాబు ద్వారానే సాధ్యమవుతుందని శిష్ట్లా లోహిత్ అభిప్రాయపడ్డారు.

Comments