ప్రతి నెల1 వ తేదీన ఠంచనుగా పింఛన్లు !! -- మంత్రి జోగి రమేష్మచిలీపట్నం : 01 డిసెంబర్  (ప్రజా అమరావతి);


*ప్రతి నెల1 వ తేదీన ఠంచనుగా పింఛన్లు !!

  -- మంత్రి జోగి రమేష్


*రాష్ట్రంలో అవ్వా తాతలు, వితంతువులు, దివ్యాంగులు, వివిధ రకాల చేతి వృత్తుల వారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తదితరులకు ఇచ్చే పింఛన్ల సంఖ్య మూడేళ్లగా ఎప్పటికప్పుడు పెరుగుతూ రికార్డులు సృష్టిస్తోంద‌ని, ప్రతి నెల 1వ తేదీన ఠంచనుగా పించను అందరికీ అందుతుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్  అన్నారు. 


గురువారం సాయంత్రం ఆయన' గడప గడపకు మన ప్రభుత్వం ' కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లా పెడన నియోజవర్గం గూడూరు మండలం లేళ్ళగరువు సచివాలయ పరిధిలోని, జక్కంచర్ల గ్రామంలో 126 గృహాలను సందర్శించారు. తొలుత అయిన ఆత్మూరి వెంకటనారాయణ,మత్తి వీర వెంకట సాంబశివరావు, కనగాల శేషమ్మ, వెన్నా గంగాధర్ రావు, బావిశెట్టి సూర్య కన్నారావు, వెన్నా వెంకటేశ్వర్లు, ఆత్మూరి రంగనాయకమ్మ, ఆత్మురి పావని తదితరుల ఇళ్లను సందర్శించారు.  ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. జక్కంచర్ల గ్రామంలో 12 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసుకున్న అంగన్వాడీ భవనానికి ప్రారంభోత్సవం చేశారు.


ఈ సందర్భంగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పలుచోట్ల అవ్వా, తాతలకు పెన్షన్లు అందుతున్నాయా అని మంత్రి జోగి రమేష్ పలువురిని అనేకసార్లు ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు అందని వారికి వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన ఆదేశించారు. 


ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ పలువురు గ్రామస్తులతో మాట్లాడుతూ,గత అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు వరకు అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 43 నుంచి 44 లక్షల మందికే పింఛన్లు అందేవని అయితే, ముఖ్యమంత్రిగా వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత అవ్వా తాతలతో పాటు ఇతరులకు ఇచ్చే పింఛన్ల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పింఛనుదారులలో ఒకరు చనిపోతేనే ఆ స్థానంలో మరొకరికి పింఛన్‌ ఇచ్చే దుర్మార్గ సాంప్రదాయం కొనసాగేదన్నారు. అమానవీయమైన ఈ  విధానానికి సీఎం వైయ‌స్ జగన్‌ స్వస్తి పలికారని మంత్రి జోగి రమేష్ చెప్పారు. సంతృప్త స్థాయిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్‌ మంజూరు చేసే విధానాన్ని అమలులోకి తెచ్చారని తెలిపారు. దీంతో రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రతి నెల 1 వ తేదీన ఠంచనుగా పించను అందుతోందన్నారు. పైగా, అప్పటి మాదిరిగా పింఛను కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా లబ్ధిదారులు ఉన్న చోటుకే గ్రామ వార్డు వలంటీర్లు వెళ్లి పింఛను ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టారన్నారు  దీంతో పింఛను దారులకు వ్యయ ప్రయాసలు తప్పాయిన్నారు. ఇప్పటికే పింఛను అందుకుంటున్న వారితో పాటు కొత్తవారికి కూడా వలంటీర్లు వారున్న చోటుకే వెళ్లి డబ్బు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి  చెప్పారు.


అనంతరం సాయంత్రం 6 గంటల నుంచి గూడూరు మండలం, లేళ్లగరువు సచివాలయం పరిధిలోని గురిజేపల్లి గ్రామం గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని

మేలు చేసే ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు గ్రామస్తులంతా బాసటగా నిలవాలని,మీ అందరి దీవెనలు,ఆశీర్వాదాలు ఆయనకు  అందచేయాలని మంత్రి జోగి రమేష్ కోరారు.


    ఈ కార్యక్రమంలో  జక్కంచర్ల  సర్పంచ్  ఆత్మూరి వెంకట రమణ, గూడూరు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తలుపుల కృష్ణారావు,  గూడూరు ఎంపిపి సంగా మధుసూదన్ రావు గూడూరు జెడ్పిటీసి వేముల సురేష్ వెంకట రంగబాబు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కారుమంచి కామేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు  యర్రంశెట్టి శ్రీనివాసరావు, రైతు భరోసా కేంద్రం చైర్మన్ పర్ణం మహాలక్ష్మి నాయుడు, పిఎసిఎస్ చైర్మన్ ఆత్మూరి మల్లి,  జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గొర్రెపర్తి రవికుమార్, గూడూరు ఎంపీడీవో డి. సుబ్బారావు తహసీల్దార్ బి.వి ప్రసాద్, మండల వ్యవసాయ శాఖ అధికారి కొక్కిలిగడ్డ హెప్సీబా రాణి,     స్థానిక ప్రజా ప్రతినిధులు , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు,వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


Comments