132 కెవి లైన్ , టవర్స్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

 132 కెవి లైన్ , టవర్స్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలి**: జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), డిసెంబర్ 06 (ప్రజా అమరావతి): 


*జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసే 132 కెవి లైన్, టవర్స్ ఏర్పాటు కోసం అవసరమైన స్థలానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం పుట్టపర్తి కలెక్టర్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లాలో నూతనంగా 132 కెవి లైన్ల  మరియు EHT  టవర్స్ లైన్ల ఏర్పాటు నేపథ్యంలో చెల్లించాల్సిన నష్టపరిహారంపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ టిఎస్.చేతన్, ఇన్చార్జి  డిఆర్ఓ  మరియు పుట్టపర్తి ఆర్డిఓ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.*


*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నూతనంగా 132 కెవి లైన్ల నిర్మాణం కోసం తీసుకున్న స్థలానికి అందించాల్సిన నష్టపరిహారంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. జిల్లాలోని కదిరి నుంచి ముదిగుబ్బ వరకు 132 కెవి లైన్లను ఏర్పాటు చేయనున్నామన్నారు. కదిరి మండలం కుటాగుళ్ల, ఎర్రదొడ్డి, చిప్పలమడుగు, పట్నం గ్రామాల్లో, ముదిగుబ్బ మండలం ములకవేముల, నాగిరెడ్డిపల్లి గ్రామాల పరిధిలో, ధర్మవరం మండలంలోని ధర్మవరం, కునుతూరు, చిగిచెర్ల తదిదర గ్రామాల పరిధిలో 132 కెవి లైన్ కొత్తగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 132 కెవి లైన్ టవర్ వేసినందుకు సంబంధిత స్థలానికి నష్టపరిహారం అందించే విషయమై త్వరితగతిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.*


*ఈ సమావేశంలో ఆర్డీవోలు తిప్పేంద్ర నాయక్, రాఘవేంద్ర, ట్రాన్స్కో ఏఈ శ్రీధర్, డిఈఈ ఉమామహేశ్వరరావు, జిల్లా రిజిస్ట్రార్, కృష్ణకుమారి,  వ్యవసాయ  శాఖ జెడి సుబ్బారావు,  ఉద్యానవనశాఖ  అధికారి చంద్రశేఖర్,  వేణుగోపాల్  తదితరులు పాల్గొన్నారు.Comments