జీ-20పై అఖిలపక్ష సమావేశం లో పాల్గొన్న అధినేత చంద్రబాబు

 *జీ-20పై అఖిలపక్ష సమావేశం లో పాల్గొన్న అధినేత చంద్రబాబు


*


న్యూఢిల్లీ (ప్రజా అమరావతి): జీ-20పై అఖిలపక్ష సమావేశం లో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సమావేశంలో డిజిటల్ నాలెడ్జ్ అంశం పై  టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. చంద్రబాబు సూచించిన డిజిటల్ నాలెడ్జ్ అంశాన్ని తన ప్రసంగం లో ప ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భారత్ దేశ భవిష్యత్ ప్రయాణం పై వచ్చే 25 ఏళ్లకు విజన్ డాక్యుమెంట్ సిద్దం చేసుకోవాలి. వచ్చే 25 ఏళ్లలో ప్రపంచం లో భారత్ నంబర్ వన్ లేదా నంబర్ 2  దేశం గా అవతరిస్తుంది. యువ శక్తి మన దేశానికి ఉన్న బలం, వారికి అవకాశాలు సృష్టించేలా ప్రభుత్వాలు పాలసీల రూపకల్పన జరగాలని, దేశానికి ఉన్న మానవ వనరుల శక్తి ని, నాలెడ్జ్ ఎకానమీ అనుసంధానించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు వస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు.

Comments