సమాజశ్రేయస్సు కోరేవారు స్వచ్ఛందసేవకులు

 


సమాజశ్రేయస్సు కోరేవారు స్వచ్ఛందసేవకులు 


- యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జనగామ తిరుపతి

-  అంతర్జాతీయ స్వచ్ఛంధ సేవాదినోత్సవం 


గోదావరిఖని డిసెంబర్ 5 (ప్రజా అమరావతి): మానవసేవయే మాధవసేవ అని నమ్మి తనసంతోషంతోపాటు సమాజంపట్ల బాధ్యత చుట్టుఉన్నవారి సంతోషాన్ని కాంక్షించి ప్రతిఫలాన్ని ఆశించకుండా పరులకి సాయం చేసేవారె స్వచ్ఛందసేవకులు అని యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జనగామ తిరుపతి అన్నారు. డిసెంబర్ 5 సోమవారం అంతర్జాతీయ స్వచ్ఛంధ సేవాదినోత్సవం సందర్భంగా ఆయన ప్రకటన విడుదల చేశారు.  స్వచ్ఛంధసేవకుల సేవలను గుర్తించిన రోజే ఈరోజు అని దీనిని ఇంటర్నేషనల్ వాలంటీర్ డే ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్ గా పిలుస్తారు అని అన్నారు.  ప్రతిఒక్కరిని స్వచ్ఛంద సేవలోపాల్గొనే అవకాశాన్ని ఇస్తు సంస్థలను ప్రోత్సహించడానికి స్థానిక, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలలో స్థిరమైన అభివృద్ధి లక్ష్యసాధన దీనిఉద్దేశం అన్నారు. దీనిని అనేక ప్రభుత్వేతర సంస్థలు, పౌర సమాజం మరియు ప్రైవేట్ రంగంవారు సైతం జరుపుకుంతున్నారు అని అన్నారు .ఇది యునైటెడ్ నేషన్స్ వాలంటీర్స్ ప్రోగ్రామ్ ద్వారా గుర్తించబడింది అని తెలిపారు. ప్రస్తుత అంచనాల ప్రకారం వాలంటీర్లలో 60 శాతం మహిళలు ఉన్నారు అని అన్నారు. ప్రజలందరికీ  సమగ్రమైన స్థిరమైన నమ్మకాన్ని ఇచ్చే స్వచ్ఛంద సేవాస్ఫూర్తిని గుర్తించాల్సిన ఆవశ్యకత ఉంది అని అన్నారు. 

సంక్షోభ సమయాల్లో స్వచ్ఛందసేవకులు మొదటగా స్పందిస్తున్నారు అని ప్రమాదాలలో ఉన్నవారికి సహాయం చేస్తున్నారు అని పేర్కొన్నారు. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి కోసం అంతర్జాతీయ వాలంటీర్ దినోత్సవాన్ని ఆమోదించారు అని తెలిపారు. అట్టడుగులో ఉన్నవారికి సేవతో సంఘీభావం తెలిపి ఉమ్మడి భవిష్యత్తు కోసం ఇప్పుడే స్వచ్ఛందంగా సేవచేద్దాం అనె ప్రతిజ్ఞతో చుట్టూ ఉన్నవారి జీవితాలను మెరుగుపరచడానికి కంకణ బద్దులై ఉన్నా ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు  అలాగె  కోవిడ్  19 మహమ్మారి సమయంలో వాలంటీర్ల సేవలు అమోఘం అని కొనియాడారు. మెరుగైన సమాజ నిర్మాణం కోసం అందరిలో మార్పు జరిగేలా నిస్వార్ధంగా సేవచేద్దాం - స్వచ్ఛందంగా సేవచేద్దాం అని ఈసందర్బంగా యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జనగామ తిరుపతి పిలుపునిచ్చారు.

Comments