ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పకడ్బందీగా అమలు
*
*: ఎస్సీ, ఎస్టీ కేసులపై మరింత అప్రమత్తత అవసరం*
*: జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*
పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), డిసెంబర్ 27 (ప్రజా అమరావతి):
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ ఆదేశించారు. మంగళవారం పుట్టపర్తి కలెక్టర్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్, తదితరులతోపాటు జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కేసులపై మరింత అప్రమత్తత అవసరం అన్నారు. జిల్లాలో ఎక్కడైనా నెలకొన్న సమస్యలకు సంబంధించి అన్ని రకాల ఆధారాలతో ఫిర్యాదు చేస్తే పరిశీలించి తాము చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న స్మశాన వాటికల సమస్యలను నెలరోజుల్లోగా పరిష్కరించేలా చూస్తామన్నారు. జిల్లా స్థాయి విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సమావేశంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను వచ్చే సమావేశం నాటికి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా ప్రధాన కేంద్రం పరిసర ప్రాంతాలలో త్వరలో అంబేద్కర్ విగ్రహానికి ఏర్పాటు చేయడానికి స్థల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఎక్కడెక్కడ దళిత కాలనీలకు స్మశాన వాటికలు అవసరము వాటిని గుర్తించడానికి సంబంధిత ఆర్డీవోలకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని. వాటిని ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ,కేసులలో బాధితులకు నష్టపరిహారం 55 కేసులకు, రూ28,87,500 లు సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా అందజేయడం జరిగిందని తెలిపారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు కింద 64 కేసులు ఉన్నాయని తెలిపారు,
ఈ సందర్భంగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు అయితే సంబంధిత వ్యక్తులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఎస్సీ కాలనీలకు సంబంధించి స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగిందని, ఇంకా ఎక్కడైనా స్మశాన వాటికల ఏర్పాటు అవసరమైతే ఎంపీ ల్యాండ్స్ నుంచి అగ్రభాగం నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులు రిపోర్ట్ అయినప్పుడు పోలీసు వ్యవస్థ జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అరెస్టు చేయగలిగిన కేసుల్లో సంబంధిత వ్యక్తుల్ని అరెస్టు చేయగలుగుతున్నారన్నారు. ఎస్సీ కేసు రిపోర్ట్ అయ్యాక కొంతమంది స్టే తెచ్చుకుంటున్నారని, స్టే అనేది కవచం కారాదని, కోర్టులను నిరంతరం మానిటర్ చేయాలన్నారు. అరెస్టు చేయగలిగిన కేసుల్లో సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేయాలని, ఎక్కడైనా చర్యలు తీసుకోలేదనే విషయమై మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకునేలా తమ వంతు కృషి చేస్తామన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. దిశ యాప్, 14456 ట్రోల్ ఫ్రీ నంబర్ పై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ కమిటీ మెంబర్లు మాట్లాడుతూ ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని, సికేపల్లి, ధర్మవరం మండలంలోని సీతారాం పల్లి, తనకల్లు మండలంలో మార్క వారి పల్లి, నల్లమడ మండలంలో దొన్నుకోట, సోమందేపల్లి మండలం బ్రాహ్మణపల్లి, లేపాక్షిలో మండలంలో కొండూరు, కోరుకుంట్ల, తాడిమర్రి, తలుపుల, ఎర్ర వంకపల్లి, ఎస్సీ ఎస్టీ కాలనీ ప్రజలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని కమిటీ సభ్యులు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు , తదితర సమస్యలను వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మా దృష్టికి సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ సమావేశంలో సోషల్ వెల్ఫేర్ డిడి శివరంగ ప్రసాద్, ఆర్డీఓలు భాగ్యరేఖ, తిప్పే నాయక్, రాఘవేంద్ర, ఎస్డిపిఓ హుస్సేన్ పీరా, డిఆర్డిఏ పీడి నరసయ్య, అగ్రికల్చర్ ఏడి విద్యావతి, డిటిడబ్ల్యూఈ మోహనరాము, ఎస్సీ, ఎస్టీ కమిటీ మెంబర్లు నరసింహమూర్తి, వెంకటేష్, శ్రీనివాసులు, గంగులయ్య, సురేష్, ఎన్జీవోలు ఫరూక్ భాషా, వీరనారాయణ, మహబూబ్ భాష, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment