దేశీయ వలసదారులకు సుదూర ఓటింగ్¬ను ప్రారంభించడానికి ఇసిఐ సిద్ధంగా ఉంది.


అమరావతి (ప్రజా అమరావతి);


దేశీయ వలసదారులకు సుదూర ఓటింగ్¬ను ప్రారంభించడానికి ఇసిఐ సిద్ధంగా ఉంది; వలస ఓటరు, ఓటు వేయడానికి స్వంత రాష్ట్రానికి ప్రయాణించవలసిన అవసరం లేదు.


ప్రోటోటైప్ – బహుళ – నియోజకవర్గ సుదూర ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని (ఆర్¬విఎం) ఇసిఐ అభివృద్ధి చేస్తున్నది ; ప్రోటోటైపు ‘ఆర్¬విఎం’ను ప్రదర్శించడానికి రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తున్నది.


ప్రోటోటైపు ‘ఆర్¬విఎం’ ఒకే సుదూర పోలింగ్ బూత్ నుండి వివిధ నియోజకవర్గాలను నిర్వహించగలదు.


‘ఇసిఐ’ రాజకీయ పార్టీల నుండి న్యాయపరమైన, నిర్వహణాపరమైన, పరిపాలనా మరియు సాంకేతికపరమైన అభిప్రాయాలను కోరుతూ కాన్సెప్ట్ నోట్¬ను రూపొందిస్తున్నది.


వాస్తవానికి సాంకేతికాభివృద్ధి యుగంలో వలస ఆధారిత ఓటు హక్కును రద్దు చేయడం ఒక ఐచ్ఛికం కాదు. 2019 సార్వత్రిక ఎన్నికలలో 67.4 శాతం ఓటింగ్ నమోదైంది మరియు       30 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకపోవడం మరియు వివిధ రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలో భిన్నమైన ఓటింగ్ శాతం గురించి భారత ఎన్నికల సంఘం ఆందోళన చెందుతోంది. ఓటరు కొత్త నివాస స్థలంలో నమోదు చేసుకోవడాన్ని ఎంచుకోకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని, తద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేకుండా పోతుందని అర్థం అయింది. అంతర్గత వలసల (దేశీయ వలసదారులు) కారణంగా ఓటు వేయలేకపోవడం అనేది ఓటరు ఓటింగ్ శాతాన్ని మెరుగుపరచడానికి మరియు భాగస్వామ్య ఎన్నికలను కట్టుదిట్టం చేయడానికి పరిష్కరించాల్సిన ప్రముఖ కారణాలలో ఒకటి. దేశంలో వలసలకు సంబంధించి కేంద్ర డేటాబేస్ ఏదీ అందుబాటులో లేనప్పటికీ, ప్రజా క్షేత్రంలో అందుబాటులో ఉన్న డేటా యొక్క విశ్లేషణ పని, వివాహం మరియు విద్య సంబంధిత వలసలను దేశీయ వలసలలో ముఖ్యమైన అంశాలుగా పేర్కొంటున్నది. మొత్తం దేశీయ వలసలలో గ్రామీణ జనాభాలో బయటి వలసలు ప్రధానమైనవి. దాదాపు 85 శాతం అంతర్గత వలసలు రాష్ట్రాలలోనే ఉన్నాయి.


శ్రీ కుమార్ గారు ప్రధాన ఎన్నికల కమీషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే, చమోలి జిల్లాలోని సుదూర ప్రాంతాల నుండి డుమాక్ గ్రామానికి దేశీయ వలస సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్న తరువాత, వలస ఓటర్లు వారి ప్రస్తుత నివాస స్థలం నుండి వారి ఓటు హక్కును వినియోగించుకునేలా చేయడంపై తన దృష్టిని కేంద్రీకరించారు. అటువంటి సాధికారత అనేక న్యాయపరమైన, చట్టబద్ధమైన, పరిపాలనా మరియు సాంకేతికపరమైన జోక్యాలను కలిగి ఉంటుందని గ్రహించి, ECI బృందం అన్ని సామాజిక-ఆర్థిక వర్గాలలో వలసదారులు ఎన్నికలలో పాల్గొనడాన్ని సులభతరం చేయడానికి సమగ్ర పరిష్కారాలను కనుగొనడానికి సుదీర్ఘంగా చర్చించింది మరియు ద్వి-మార్గ భౌతిక రవాణా పోస్టల్ బ్యాలెట్లు, ప్రాక్సీ ఓటింగ్, ప్రత్యేక ప్రారంభ ఓటింగ్ కేంద్రాలలో ముందస్తు ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ల వన్-వే లేదా టూ-వే ఎలక్ట్రానిక్ ట్రాన్స్¬మిషన్ (ETPBS), ఇంటర్నెట్ ఆధారిత ఓటింగ్ సిస్టమ్ మొదలైనటువంటి ప్రత్యామ్నాయ ఓటింగ్ పద్ధతులను అన్వేషించింది.


భాగస్వాములందరికీ మేలైన, అందుబాటులో ఉండే మరియు అంగీకరించదగిన సాంకేతిక పరిష్కారాన్ని కనుగొనే ఉద్దేశంతో దేశీయ వలసదారుల కోసం మారుమూల పోలింగు కేంద్రాలు అంటే సొంత నియోజకవర్గం వెలుపలగల పోలింగు కేంద్రాలలో ఓటు వేయడానికి వీలుగా కాలానుగుణమైన ఎం3 ఇవిఎంల సవరించిన వర్షన్¬ను ఉపయోగించే ఐచ్ఛికాన్ని ఎన్నికల కమీషనర్లు శ్రీ అనప్ చంద్ర పాండే మరియు శ్రీ అరుణ్ గోయల్¬తోపాటు ప్రధాన ఎన్నికల కమీషనరు శ్రీ రాజీవ్ కుమార్ నేతృత్వంలో గల సంఘం ఇప్పుడు కనుగొనింది.         ఆ విధంగా, వలస ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి తన స్వంత జిల్లాకు తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదు.

      ఇతర విషయాలతోపాటు దేశీయ వలసదార్లను నిర్వచించడం, ప్రవర్తనా నియమావళిని అమలు పరచడం, ఓటింగ్¬లో గోప్యత ఉండేలా చూడడం, ఓటర్లను గుర్తించడంలో పోలింగు ఏజెంట్లకు వీలుకల్పించడం, సుదూర ఓటింగు విధానం మరియు ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రముఖంగా పేర్కొంటూ రాజకీయ పార్టీల మధ్య కాన్సెప్ట్ నోట్¬ను సర్కులేట్ చేయడమయింది. 

 

 న్యాయపరమైన సవాళ్ళు పరిపాలనాపరమైన సవాళ్ళు సాంకేతికపరమైన సవాళ్ళు

సవరణలకు అవసరమైన చట్టాలు / నియమావళులు

ఆర్.పి చట్టం, 1950 & 1951

1961, ఎన్నికల ప్రవర్తనా నియమావళి.

1960, ఓటర్ల నమోదు నియమావళి. సుదూర ఓటర్ల స్వయం ప్రకటనకు వీలుకల్పించడం. సుదూర ఓటింగ్ విధానం

సుదూర ప్రదేశాలలో ఓటింగ్ గోప్యతను కాపాడేందుకు నియంత్రిత వాతావరణాన్ని కల్పించడం. విధానాలు / బహుళ నియోజకవర్గం సుదూర ఇవిఎం లేదా ఏదేని ఇతర సాంకేతికతను ఓటర్లకు తెలియపరచడం.

వలస ఓటరు నిర్వచనం

శాశ్వతంగా తరలి పోయినందున పోలింగ్ రోజు గైరు హాజరు.

సాధారణ నివాసం & ‘తాత్కాలిక గైరు హాజరు’ న్యాయ నిర్మాణం సుదూర ఓటింగ్ నిర్వచనం సందర్భంలో వాస్తవ ప్రదేశం రిజిస్ట్రేషన్¬ను తిరిగి ఉంచడం. సుదూర ఓటింగ్ బూత్¬లలో పోలింగ్ ఏజెంట్ల ఏర్పాటు & ఒకరికి బదులుగా వేరొకరు ఓటు వేయడాన్ని నిరోధించేందుకు ఓటర్లను గుర్తించేలా చూడటం. సుదూర బూత్¬లలో వేయబడిన ఓట్లను లెక్కించడం మరియు ఇతర రాష్ట్రంలో ఉన్న ఆర్¬ఓకు తరలించడం. 

నెలకొల్పాల్సిన బూత్¬ల సంఖ్య & ప్రదేశాలు

సుదూర ఓటింగును నిర్వచించడం.

ప్రాదేశిక నియోజకవర్గ భావనతో వ్యవహరించడం.

సుదూరత, నియోజకవర్గం వెలుపల, జిల్లా వెలుపల లేదా రాష్ట్రం వెలుపల. సుదూర పోలింగ్ కేంద్రాల కోసం పోలింగ్ సిబ్బంది నియామకం మరియు వాటి పర్యవేక్షణ

సుదూర ప్రదేశంలో ఎంసిసి అమలు (ఇతర రాష్ట్రం)దేశీయ వలసదారులను వారి సుదూర ప్రాంతాల నుండి అంటే విద్య / ఉపాధి మున్నగు వాటి కోసం ప్రస్తుత వారి నివాస స్థలం నుండి వారి సొంత నియోజకవర్గాలలో ఓటు వేయడానికి వీలుగా ఎన్నికల సంఘం ఒక ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ సహకారంతో బహుళ నియోజకవర్గ సుదూర ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఆర్.వి.ఎం) ను తీసుకొని వచ్చేందుకు ఇప్పుడు సిద్ధంగా ఉంది.


ఈ సవరించిన ఇవిఎం నమూనా ఒకే సుదూర పోలింగు బూతు నుండి 72 బహుళ నియోజకవర్గాల వరకు నిర్వహించగలదు. ఈ చొరవ అమలు చేయబడితే, వలసదారుల సామాజిక పరివర్తనకు దారితీస్తుంది. తరచుగా నివాసాలను మార్చడం, వలస ప్రాంతం అంశాలలో తగినంత సామాజిక, భావోద్వేగ సంబంధం కలిగి లేకపోవడం, శాశ్వత నివాసం / ఆస్తి మొదలైనవి వున్నందున వారి స్వంత / స్థానిక నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో వారి పేరును తొలగించడానికి అంగీకరించకపోవడం వంటి వివిధ కారణాలతో అనేకసార్లు వారి పని ప్రదేశంలో నమోదు చేసుకోవడానికి ఇష్టపడని వారి మూలాలతో అనుసంధానం చేయవచ్చు.


ఈ బహుళ నియోజకవర్గ ప్రోటోటైపు సుదూర ఈవిఎం పనితీరును ప్రదర్శించటానికి 16-01-2023 తేదీన అన్ని గుర్తింపు పొందిన 8 జాతీయ మరియు 57 రాష్ట్ర రాజకీయ పార్టీలను సంఘం ఆహ్వానించింది. సాంకేతిక నిపుణుల కమిటీ సభ్యులు కూడా హాజరు కానున్నారు. దేశీయ వలసదారుల కోసం చట్టంలో అవసరమైన మార్పులు, పరిపాలక కార్యవిధానం మరియు ఏవేనీ ఇతర ఓటింగు విధానం / ఆర్¬విఎం / సాంకేతికతలో మార్పులకు సంబంధించిన వివిధ సంబంధిత అంశాలపై 31-01-2023 తేదీనాటికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి వ్రాతపూర్వక అభిప్రాయాలను కూడా సంఘం కోరింది. 


వివిధ భాగస్వాముల నుండి అందిన అభిప్రాయాలు, ప్రోటోటైపు ప్రదర్శన ఆధారంగా సంఘం సుదూర ఓటింగ్ పద్ధతిని అమలు చేసే ప్రక్రియను సముచితంగా ముందుకు తీసుకువెళుతుంది.Comments