సమగ్రశిక్షాలోవృత్తివిద్య – ఉద్యోగాల పేరిట మోసపోవద్దు
*సమగ్రశిక్షాలోవృత్తివిద్య – ఉద్యోగాల పేరిట మోసపోవద్దు*

– * శ్రీ ఎస్ సురేష్ కుమార్ గారు, రాష్ట్ర పథక సంచాలకులు, సమగ్రశిక్షా*

విజయవాడ (ప్రజా అమరావతి);

పాఠశాలలో వృత్తివిద్య కోర్సులు బోధించడానికి ఒకేషనల్ ట్రైనింగ్ పార్టనర్స్(Vocational Training Partners) ఒకేషనల్ ట్రైనర్లని (Vocational Trainers) నియమించుకుని పాఠశాలల్లో బోధించటం జరుగుతుంది. ఈ పోస్టులు పరిమితకాలానికి మాత్రమే నియమించబడును. 

సమగ్రశిక్షా ఒకేషనల్ ట్రైనర్ పోస్టులు ఇప్పిస్తామని చెప్పి ఇప్పుడు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోకూడదని తెలియజేయడమైనది. 

సమగ్రశిక్షా నుండి వృత్తివిద్యలో ఎటువంటి నియామకాలు జరపబడవు, కావున వీరి నియకమకానికి సంబంధించి సమగ్రశిక్షా ఎటువంటి బాధ్యత వహించదు.

ఇటువంటి వాటిపై ఫిర్యాదులను vocational.apsamagra@gmail.comకు మెయిల్ చేయగలరు.
Comments