రాష్ట్రం అభివృద్ధిలో కాదు అప్పుల్లో ముందుంది

 *- రాష్ట్రం అభివృద్ధిలో కాదు అప్పుల్లో ముందుంది


 *- గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు* 

 *- కొనసాగుతున్న "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి"* 


గుడివాడ, డిసెంబర్ 23 (ప్రజా అమరావతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో కాకుండా అప్పుల్లో ముందుందని తెలుగుదేశం పార్టీ గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని 22వ వార్డు కార్మికనగర్లో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రావి ఇంటింటికీ వెళ్ళి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రావి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి కనిపించడం లేదని అన్నారు. ఇదిలా ఉండగా  గురువారం రాత్రి స్థానిక 1వ వార్డులో నిర్వహించిన "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" కార్యక్రమానికి ప్రజలు అనూహ్యంగా స్పందించారు. వార్డు ప్రజలనుద్ధేశించి రావి మాట్లాడుతూ కొడాలి నాని మంత్రిగా ఉన్నపుడు సన్నబియ్యం ఇస్తానని ఇవ్వలేదని, ఈ నెల 21న ఇళ్ళు ఇస్తానని చెప్పి గాల్లో చూపించాడన్నారు. గుడివాడ నియోజకవర్గంలో పెద్దఎత్తున ఇసుక, మట్టి మాఫియాలు జరిగాయన్నారు. గుడివాడ ప్రజలు ఏది చెబితే అది నమ్ముతారనే భ్రమలో ఎమ్మెల్యే కొడాలి నాని ఉన్నారన్నారు. బూతులు తిట్టినా పట్టించుకోరని అనుకోవడం కొడాలి నాని అవివేకమన్నారు. డబ్బు ఖర్చు పెట్టి గెలుద్దామనే ధీమాలో ఉన్న కొడాలి నానికి గుడివాడ ప్రజలు త్వరలోనే బొమ్మ చూపిస్తారని రావి అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముళ్ళపూడి రమేష్ చౌదరి, యార్లగడ్డ సుధారాణి, పోలాసి ఉమామహేశ్వరరావు, కంచర్ల సుధాకర్, అల్లాడ శ్రీను, వాసే మురళి, పెద్దు వీరభద్రరావు, సుంకర గాంధీ, సయ్యద్ జబీన్, దాసి శ్యామ్, గొరిపర్తి ప్రసాద్, కుందేటి ప్రసాద్, మస్తాన్, బిస్మిల్లా, నాగూర్ బాజీ, గౌస్ తదితరులు పాల్గొన్నారు.

Comments