సామాన్య భక్తుల సౌకర్యార్థమే బ్రేక్ దర్శన సమయం మార్పు : టిటిడి ధర్మకర్తల మండల అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

 సామాన్య భక్తుల సౌకర్యార్థమే బ్రేక్ దర్శన సమయం మార్పు : టిటిడి ధర్మకర్తల మండల అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

తిరుమల, , డిసెంబరు 01 (ప్రజా అమరావతి); తిరుమల శ్రీవారి దర్శనం కోసం రాత్రి నుండి కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు ఉదయం త్వరగా స్వామివారి దర్శనం కల్పించేందుకు బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మార్పు చేసినట్లు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు.

శ్రీవారి ఆలయం ఎదుట గురువారం ఉదయం ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ గురువారం నుంచి బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు ప్రారంభించామన్నారు. మొదటిరోజు ఉదయం 6 నుంచి 7.30 గంటల వరకు దాదాపు 8,000 మంది సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు వివరించారు. ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శన సమయాన్ని మార్పు చేసి పరిశీలిస్తున్నామని ఒక నెల తరువాత తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ మార్పు వల్ల ఉదయం 2 నుండి 3 గంటల సమయం లభిస్తుందని, దాదాపు 15,000 మంది సర్వదర్శనం భక్తులకు దర్శనం కల్పించవచ్చని తెలిపారు. బ్రేక్ దర్శనానికి వచ్చే భక్తులు ఏరోజుకారోజు తిరుపతి నుంచి ఉదయం తిరుమలకు రావచ్చని, తద్వారా తిరుమలలో గదులపై ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు.

Comments