శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి*శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి


*


తిరుపతి, డిసెంబర్28 (ప్రజా అమరావతి): తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి.


గౌ. భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి వై చంద్ర  చూడ్ బుధవారం సాయంత్రం కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.


ఆలయం ఎదుట టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ జస్టిస్ చంద్ర చూడ్ కు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో  సాంప్రదాయ బద్ధంగా స్వాగతించారు. ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం జస్టిస్ చంద్ర  చూడ్ దంపతులు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు అమ్మవారి శేష వస్త్రంతో సన్మానించి వేద ఆశీర్వాదం చేశారు . అనంతరం ఆశీర్వాద మండపంలో సిజె ఐ కి చైర్మన్, ఈవో అమ్మవారి ప్రసాదాలు అందజేసి వస్త్రంతో సన్మానించారు. 


గౌ.మూడవ అదనపు జిల్లా జడ్జి  వీర్రాజు , టీటీడీ సివిఎస్వో నరసింహ కిషోర్, డిప్యూటీ ఈవో  శ్రీమతి శాంతి, విజివో మనోహర్, ఏఎస్పీ కులశేఖర్, డిఎస్పీ మురళీ కృష్ణ, ఆలయ ఏఈవో ప్రభాకర్ రెడ్డి ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు అర్చకులు బాబు స్వామి పాల్గొన్నారు.


Comments