నల్సా మాదక ద్రవ్యాల బాధితులకు న్యాయ సేవలు మరియు మాదక ద్రవ్యాల నిషేద పధకం, 2015”రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రాజమహేంద్రవరం నందు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రెండు నల్సా పధకాలు “నల్సా అక్రమ రవాణా మరియు వాణిజ్య పరమైన లైంగిక దోపిడి పధకం, 2015” మరియు “నల్సా మాదక ద్రవ్యాల బాధితులకు న్యాయ సేవలు మరియు మాదక ద్రవ్యాల నిషేద పధకం, 2015”


పై మంగళ వారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ప్రత్యూష కుమారి మాట్లాడుతూ అక్రమ రవాణాకు పిల్లలు, స్త్రీలు ఎక్కువగా గురవుతున్నారని తెలిపారు. టాన్స్ జెండర్లు లైంగిక దోపిడీకి గురవుతున్నారని అన్నారు. ట్రాన్స్ జెండర్లు వారికి కల్పించిన హక్కుల గురించి అవగాహన కలిగి ఎవ్వరికీ భయపడకుండా, స్వాభిమానంగా జీవించాలని అన్నారు. వారికి ఉన్న వివిధ సంక్షేమ పధకాల గురించి తెలిపారు.  మాదక ద్రవ్యాల ఉత్పత్తి, సరఫరా, వాడకం, క్రయ విక్రయాలు అన్నీ చట్ట రీత్యా నేరం అని పేర్కొన్నారు. యువత, పిల్లలు ఈ మాదక ద్రవ్యాల ఉచ్చులో పడిపోతున్నారని అన్నారు. మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల వచ్చే శారీరక, మానసిక దుష్ప్రభావాల గురించి వివరించారు. ఈ నేరాలకు పాల్పడిన వారికి కఠినమైన శిక్షలు విధించబడతాయని అన్నారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ప్లాపస్ ఛైర్మన్ శ్రీమతి.ఏ.గాయత్రి దేవి మాట్లాడుతూ నల్సా వారి పథకాల గురించి వివరించడంతో పాటు జిల్లా న్యాయ సేవధికార సంస్థ అందిస్తున్న న్యాయ సేవలను అందరూ వినియోగించుకోవాలని అన్నారు. అనంతరం 9 మండి ట్రాన్స్ జెండర్లకు గుర్తింపు కార్డులు అందజేశారు.


 

      ఈ కార్యక్రమమలో రాజమహేంద్రవరం ఏ.ఎస్పీ.  పాపా రావు, కోనసీమ జిల్లా ఏ.ఎస్.పీ. శ్రీమతి. లతా మాధురి, జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి శ్రీమతి.కె.విజయ కుమారి, కాకినాడ జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి శ్రీమతి.కె.ప్రవీణ, జిల్లా లెప్రసి, ఎయిడ్స్, టి.బి అధికారి డా.రమేష్, కాకినాడ డిసేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ కామ రాజు, డి.ఏ.పి.సి.యు ప్రోగ్రాం మేనేజర్ ఆదిలింగం, కాకినాడ కలెక్టరేట్ ఎస్.డీ.సీ. శ్రీమతి జి.రత్నమణి, అమలాపురం తహ్సీల్ధార్ శ్రీమతి.ఏం.వి.ఎస్.లక్ష్మి, కోనసీమ జిల్లా పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహ్సీల్ధార్ శ్రీమతి.టి.వి.ఎస్.రామ దేవి, అమలాపురం అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీ.కె.వి.వి. సత్యనారాయణ, జన కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటి అధ్యక్షులు శ్రీ.ఎం.నాగేశ్వర రావు, ట్రాన్సజెండర్ల సంక్షేమం కోసం పని చేస్తున్న వివిధ ఎన్. జీ. వో. సంస్థల వారు, తదితరులు పాల్గొన్నారు.

Comments