సిఎస్ తో భేటీ అయిన డిఎఆర్పిజి కార్యదర్శి వి.శ్రీనివాస్ తో కూడిన ప్రతినిధుల బృందం

 సిఎస్ తో భేటీ అయిన డిఎఆర్పిజి కార్యదర్శి వి.శ్రీనివాస్ తో కూడిన ప్రతినిధుల బృందం


అమరావతి,12 జనవరి (ప్రజా అమరావతి):కేంద్ర డిపార్టుమెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్సుఅండ్ పబ్లిక్ గ్రీవియెన్సెస్(DAR&PG)కార్యదర్శి వి.శ్రీనివాస్ నేతృత్వంలో గల ప్రతినిధుల బృందం గురువారం అమరావతి సచివాలయంలోని సిఎస్ కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డితో భేటీ అయింది.పరిపాలనా సంస్కరణలు,పబ్లిక్ గ్రీవియెన్సెస్ రిడ్రస్సల్  ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలకు సంబంధించి వివిధ రాష్ట్రాలకు జాతీయ స్థాయిలో డిపార్టుమెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్సుఅండ్ పబ్లిక్ గ్రీవియెన్సెస్  నోడలు ఏజెన్సీగా వ్యవహరిస్తోంది.ఈవిభాగం పరిపాలనా సంస్కరణలు,పబ్లిక్ గ్రీవియెన్సెస్ రిడ్రెస్సల్ కు సంబంధించి రాష్ట్రాలకు తగిన సమాచారాన్ని అందించడం జరుగుతోంది.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ గవర్నెస్ ఇండెక్సు,నేషనల్ ఇ-సర్వీసెస్ డెలివరీ అసెస్మెంట్,డిస్ట్రిక్ట్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్సు,సెక్రటేరియట్ రిఫార్మ్సు,గ్రీవియెన్స్ రిడ్రస్సల్ అంశాల్లో మెరుగైన రీతిలో పనిచేయడంతో కేంద్ర డిఎఆర్&పిజి కార్యదర్శి బృందం సిఎస్ తో భేటీ కావడం జరిగింది.

ఈసందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తున్న పరిపాలనా సంస్కరణలు,పబ్లిక్ గ్రీవియెన్సెస్ పరిష్కారం,రాష్ట్ర,జిల్లా స్థాయిలో అమలు చేస్తున్న గుడ్ గవర్నెన్స్,జాతీయ ఇ-సర్వీసెస్ డెలివరీ సిస్టమ్ అమలుకు తీసుకుంటున్న చర్యలను కేంద్ర కార్యదర్శి శ్రీనివాస్ కు వివరించారు.

అంతకు ముందు కేంద్ర కార్యదర్శి వి.శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వ స్థాయిలో చేపట్టిన పరిపాలనా సంస్కరణలు,పబ్లిక్ గ్రీవియెన్సెస్ పరిష్కారం తదితర అంశాలకు సంబంధించిన అంశాలపై సిఎస్ డా.జవహర్ రెడ్డితో చర్చించారు.అందుకు సంబంధించి రూపొందించిన వివిధ పుస్తకాలు,డాక్యుమెంట్లను సిఎస్ కు అందించారు.

ఇంకా ఈసమావేశంలో ఇందుకు సంబంధించి వివిధ అంశాలపై చర్చించారు. ఈసమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రవీణ్ కుమార్,ముఖ్య కార్యదర్శి కె.సునీత,కార్యదర్శులు పి.భాస్కర్,ప్రద్యుమ్నపాల్గొన్నారు.కేంద్ర డిపార్టుమెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్సుఅండ్ పబ్లిక్ గ్రీవియెన్సెస్ కు చెందిన సంయుక్త కార్యదర్శి ఎన్.బిఎస్. రాజ్ పుట్,డైరెక్టర్లు కె.సంజయన్,ఎన్.కె.మీనా,డిప్యూటీ కార్యదర్శి సరిత తనేజ,అండర్ సెక్రటరీ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

       

Comments