పెట్టుబడులకు దోహదం.

 హైదరాబాద్ (ప్రజా అమరావతి);


*తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఏషియా (20వ  సదస్సును రాష్ట్ర పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి కే.తారకరామారావు ప్రారంభించారు.*


హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ) వేదికగా జరుగుతున్న ఈ సదస్సు నేటి నుంచి మూడు రోజులపాటు కొనసాగనుంది.


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఏషియా (20వ సదస్సు) సదస్సును రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావు ప్రారంభించారు. హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ) వేదికగా జరుగుతున్న ఈ సదస్సు నేటి నుంచి మూడు రోజులపాటు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌, నేషనల్‌ హెల్త్‌ అథారిటీ అదనపు సీఈవో బసంత్‌ గార్గ్‌, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.


మూడురోజులపాటు జరుగనున్న ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల నుంచి 2 వేలకు మందికిపైగా ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా, మెడ్‌టెక్‌, ఆరోగ్య సంరక్షణ రంగాలపై నిపుణుల ప్రసంగాలు, బృంద చర్చలు జరుగనున్నాయి. వ్యాపార భాగస్వామ్యాలు, సాంకేతిక సమావేశాలు, ప్రపంచస్థాయి నిపుణులతో చర్చలు, ఇంటరాక్టివ్‌ సెషన్స్‌, సీఈవో కాంక్లేవ్‌, స్టార్టప్‌ షోకేస్‌, బయోపార్క్‌ సందర్శనలు తదితర కార్యక్రమాలు ఉంటాయి. రెండురోజులపాటు లైఫ్‌సైన్సెస్‌, ఫార్మా, పరిశ్రమ రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తారు. చివరిరోజు వివిధ కంపెనీలకు చెందిన ప్రదర్శన ఉంటుంది. జీనోమ్‌ వ్యాలీ ఎక్స్‌లెన్స్‌ అవార్డు ప్రదానోత్సవం నిర్వహిస్తారు.


*పెట్టుబడులకు దోహదం*



తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే లైఫ్‌సైన్సెస్‌, ఫార్మా రంగ పర్యావరణ వ్యవస్థకు నిలయంగా ఉన్నది. ఇక్కడ 800కుపైగా ఫార్మా, బయోటెక్‌ కంపెనీలు ఉన్నాయి. వీటి విలువ 50 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ప్రపంచంలోని మూడింట ఒకవంతు వ్యాక్సిన్ల ఉత్పత్తి మన రాష్ట్రం నుంచే జరుగుతుండగా, దేశీయ ఔషధ ఎగుమతుల్లో 30 శాతం, ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రీడియెంట్‌) ఉత్పత్తిలో 40 శాతం, ఏపీఐ ఎగుమతుల్లో 50 శాతం తెలంగాణ నుంచే జరుగుతున్నది. టాప్‌-10 ప్రపంచ ఫార్మా కంపెనీల్లో నాలుగు కంపెనీలు మన రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. హైదరాబాద్‌లో 20కిపైగా లైఫ్‌సైన్సెస్‌, మెడ్‌టెక్‌ ఇంక్యుబేటర్లు ఉన్నాయి. దేశంలోని మరే నగరంలో ఇన్ని లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు బయో ఏషియా సదస్సు ఎంతగానో దోహదపడుతుందని చెప్పవచ్చు. అలాగే, 50కిపైగా దేశాలనుంచి ప్రతినిధులు వస్తున్నందున హైదరాబాద్‌లో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి అవకాశం ఉంటుంది...

Comments