*తిమ్మమ్మ మర్రిమాను అభివృద్ధికి కృషి
*
*: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*
*: ఎన్పీకుంట మండలంలోని తిమ్మమ్మ మర్రిమానును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్*
నంబులపూలకుంట (శ్రీ సత్యసాయి జిల్లా), మే 26 (ప్రజా అమరావతి):
తిమ్మమ్మ మర్రిమాను అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం నంబులపూలకుంట మండలంలోని తిమ్మమ్మ మర్రిమానును జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిమ్మమ్మ మర్రిమాను వద్ద ఉన్న పర్యాటకశాఖ అతిథి గృహాన్ని వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాల కల్పనకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ తో మాట్లాడి ఇక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటకశాఖ జిల్లా అధికారి నాగేశ్వరరావు, అటవీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment