ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలురాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);


** ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు


** మే 24 నుండి జూన్ 1 వరకు  జరుగుతాయి.


** ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో  ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలకు హాజరుకానున్న మొత్తం 52,571 మంది విద్యార్థులు 


** పరీక్షల సమయం ప్రధమ సంవత్సరం ఉ.9 నుంచి మ.12 వరకు ద్వితీయ సంవత్సం మ.2.30 నుంచి సా. 5.30 వరకు


** పరీక్షల నిర్వహణకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేయడమైనది.


...ఆర్ ఐ ఓ నరసింహంఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్షలు  ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లాలో 98 కేంద్రాలలో  మే  24 నుంచి ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్ లో నిర్వహించడం జరుగుతోందని ఇంటర్మీడియట్ విద్య ప్రాంతీయ తనిఖీ అధికారి  ఎన్ ఎస్ వి ఎల్ నరసింహం పేర్కొన్నారు.


ఆదివారం ఉదయం స్థానిక ఇంటర్మీడియట్ బోర్డు  తనిఖీ అధికారి కార్యాలయంలో ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణపై  డి ఈ సి మెంబర్ వి.శ్రీనివాసరావు తో కలిసి  ఆర్ ఐ ఓ   మీడియా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఎన్ ఎస్ వి ఎల్ నరసింహం మాట్లాడుతూ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు  ఈనెల 24 వ తేదీ నుండి  జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహించడం కోసం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవంత్సరం విద్యార్ధులకు  మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు  పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు చేరవేసేందుకు ఆయా రూట్ల లో ఉదయం 6 గంటల నుంచే ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటాయని తెలిపారు.  ఈ పరీక్షలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 52571 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. విద్యార్థులు పరీక్షా సమయానికి  1 గంట ముందుగా  వారికి కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రం లోకి అనుమతించడం జరగదని తెలిపారు.  ఈవిషయాన్ని  తల్లిదండ్రులు, విద్యార్థులు ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. 


తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లాల కలెక్టర్లుతో  సమన్వయ సమావేశాలు నిర్వహించి,  అన్ని శాఖల సహాయ సహకారములు కోరడం జరిగినదని తెలిపారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు పరీక్షా కేంద్రాలలో ఏర్పాటు చేయడానికి  తగు సూచనలు చేశామని త్రాగునీరు , శానిటేషన్ పై నిరంతర విద్యుత్తు సరఫరా పై సంబంధిత అధికారులు కోరడం జరిగిందన్నారు. మెడికల్ శాఖ ద్వారా తగిన అత్యవసర మందులు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు, మెడికల్ క్యాంపు  ఏర్పాట్లు కై కోరినట్లు నరసింహం తెలిపారు.  రెవెన్యూ అధికారులు ద్వారా 144 సెక్షన్ అమలు, పోలీసులు ద్వారా భద్రత, బందోబస్తు ఏర్పాటు కై చర్యలు తీసుకుంటామని తెలిపారన్నారు .


తూర్పు గోదావరి జిల్లా కు చెంది 36 పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేశామని, రాజమహేంద్రవరం డివిజన్ లో14768 మంది, కొవ్వూరు డివిజన్ లో 4568 మంది మొత్తం 19336 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారన్నారని పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలో 21,120 మంది, డా. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 14,257 మంది, అల్లూరి సీతారామరాజు(ASR) జిల్లాలో 2426 మంది విద్యార్థులు పరీక్షలు కు హజరవుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 16 స్టోరేజ్ పాయింట్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 


తూర్పు గోదావ రి జిల్లాలో 36 సెంటర్లు, కాకినాడ జిల్లాలో  37 సెంటర్లు, డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 27 సెంటర్లు, అల్లూరి సీతారామరాజు(ASR) జిల్లాలో 7 సెంటర్లు ఏర్పాటు చేసామన్నారు.  పరీక్షలు సజావుగా జరిగేందుకు  అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. పరీక్షా నిర్వహణ కేంద్రాల వద్ద144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని అవసరమైనన్ని ఓఆర్ ఎస్ ప్యాకెట్లు, ఇతర మందులు మెడికల క్యాంపులు ద్వారా జిల్లా వైద్యాధికారి అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టారన్నారు. సజావుగా పరీక్షల నిర్వహణ కోసం 196 మంది అధికారులు , సిబ్బందిని నియమించామన్నారు.   జిల్లాలో మొత్తం 5 ఫ్లయింగ్ స్కాడ్స్, 5 సిటింగ్ స్కాడ్స్ నియమించి తనిఖీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తూర్పుగోదావరి ఆర్ ఐ ఓ ఎన్ ఎస్ వి ఎల్ నరసింహం తెలిపారు.Comments