ఏపీ ఆదర్శ (మోడల్) పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలు.

 *ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం*

*పాఠశాల విద్యాశాఖ*


అమరావతి (ప్రజా అమరావతి);


*ఏపీ ఆదర్శ (మోడల్) పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలు*

•* మే 25తో  ముగియనున్న ఆన్ లైన్ లో దరఖాస్తులు 


 * జూన్ 11న ప్రవేశ పరీక్షఆంధ్రప్రదేశ్ ఆదర్శ (మోడల్) పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గానూ 6వ తరగతిలో ప్రవేశాలకు ఆన్ లైన్ దరఖాస్తులు  ఈ నెల 25తో ముగియనున్నట్లు ఏపీ మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్ శ్రీ ఎం.వి.కృష్ణారెడ్డి  సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకూ 19,500 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులకు ‌జూన్ 11న ప్రవేశ పరీక్ష ఉంటుందని, ఇంకా దరఖాస్తు చేసుకోనివారు వెంటనే cse.ap.gov.in/apms.ap.gov.in దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రుసుము, తదితర వివరాలకు వెబ్ సైట్ లేదా  ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని/ మండల విద్యాశాఖాధికారిని సంప్రదించాలని‌ తెలిపారు
Comments