అక్టోబరు 21న స్పెషల్ లోక్ అదాలత్రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);అక్టోబరు 21న  స్పెషల్ లోక్ అదాలత్ఇన్షూరెన్స్ సంస్థల, తదితరులతో ముందస్తు సమావేశం


- జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి. గంధం సునీత బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయస్థాన ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి. గంధం సునీత వారు వివిధ ఇన్షూరెన్స్ సంస్థల అధికారులు, పీటీషనర్లు మరియు ఇరు పక్షాల న్యాయ వాదులతో సమావేశం నిర్వహించారు. అక్టోబరు 21న జరగనున్న స్పెషల్ లోక్ అదాలత్ లో పెండింగ్ లో ఉన్న  మోటారు వాహనాల యాక్సిడెంటు కేసుల జాబితాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందించాలన్నారు.  ఎక్కువ మొత్తంలో కేసులను పరిష్కరిం చేందుకు ఇన్షూరెన్స్ సంస్థల అధికారులకు, న్యాయవాదులకు పలు సూచనలు చేశారు. 

Comments