బేతంచెర్లలో సచివాలయాన్ని ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.





*బేతంచెర్లలో సచివాలయాన్ని ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*



*అమ్మవారిశాల, అయ్యప్ప,ఆంజనేయ, చెన్నకేశవ,మాధవ ఆలయాలను దర్శించుకున్న మంత్రి బుగ్గన*


*కందకం డ్రైనేజీ కాలువ అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి బుగ్గన*


బేతంచెర్ల, నంద్యాల జిల్లా (ప్రజా అమరావతి); బేతంచెర్ల పట్టణంలోని 5వ సచివాలయాన్ని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు. రూ.40 లక్షలతో సకల సదుపాయాలతో నిర్మించిన సచివాలయం అందుబాటులోకి రావడంతో సంబంధిత వార్డు ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా అందుతాయని మంత్రి స్పష్టం చేశారు. సచివాలయ ప్రారంభోత్సవ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పూజ కార్యక్రమాల అనంతరం స్థానిక ప్రజలతో మంత్రి బుగ్గన మాట్లాడారు. వీధుల్లో కలియతిరుగుతూ ఆప్యాయంగా పలకరించి పాదయాత్ర చేశారు. ఇప్పటికే మౌలిక సదుపాయాలన్ని బేతంచెర్లలో ఏర్పాటైన నేపథ్యంలో ఇంకా ఏవైనా ఇబ్బందులన్నాయా అంటూ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు బేతంచెర్ల క్యాంప్ కార్యాలయం నుంచి పాదయాత్రగా బయలుదేరి స్థానిక ప్రజలను పలకరిస్తూ స్థానిక ఆలయాలను దర్శించుకున్నారు. అమ్మవారి శాల, అయ్యప్ప,ఆంజనేయ, చెన్నకేశవ,మాధవ ఆలయాలలోని పూజా కార్యక్రమాలలో మంత్రి బుగ్గన భాగస్వామ్యమయ్యారు. అమ్మవారి శాలలో నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి వేదపండితుల ఆశీర్వచనం పొందారు. ఆలయమర్యాదలతో మంత్రి బుగ్గనను పట్టువస్త్రంతో సత్కరించి, ప్రసాదం అందజేశారు. ఆ తర్వాత రూ.3.70 కోట్లతో జరుగుతున్న కందకం డ్రైనేజీ కాలువ అభివృద్ధి పనులను మంత్రి బుగ్గన పరిశీలించారు.బేతంచెర్ల పట్టణానికి కీలకమైన ఈ పనులను వేగంగా నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బేతంచెర్ల 'ఊరి వాకిలి' అభివృద్ధికి చొరవ తీసుకోవాలని మున్సిపల్ ఛైర్మన్ సీ.హెచ్ చలం రెడ్డిని ఆదేశించారు. కందకం పక్కన కోటి లచ్చమ్మ ఆలయానికి స్థలం కేటాయించాలని స్థానిక మహిళలు మంత్రి బుగ్గనకు విజ్ఞప్తి చేశారు. కందకం పూర్తి తర్వాత దృష్టిసారిద్దామని సానుకూలంగా స్పందించారు. 


అనంతరం బేతంచెర్ల మార్కెట్ యార్డు అభివృద్ధి పనులను పరిశీలించారు. రూ.60 లక్షలతో నిర్మిస్తోన్న మార్కెట్ యార్డ్ మౌలిక సదుపాయాలపై కాంట్రాక్టర్ కు పలు ఆదేశాలిచ్చారు. అంతకుముందు బేతంచెర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గోరుగుట్ట ఆటో యూనియన్ డ్రైవర్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ని కలిశారు. ఇటీవల వాహనమిత్ర అందించడం పట్ల సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బేతంచెర్ల మున్సిపల్ ఛైర్మన్ సీ.హెచ్ చలం రెడ్డి, మద్దిలేటి స్వామి ఆలయ ఛైర్మన్ రామచంద్రుడు, వైసీపీ నాయకులు బాబు రెడ్డి, ఆర్యవైశ్య సంఘ నాయకులు, ఎమ్మార్వో నరేంద్రనాథ్ రెడ్డి, బేతంచెర్ల పట్టణ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



Comments