అమిత్ షా తో ముగిసిన పవన్ కళ్యాణ్ భేటీ.

 *అమిత్ షా తో ముగిసిన పవన్ కళ్యాణ్ భేటీ


*


న్యూ ఢిల్లీ :అక్టోబర్ 25 (ప్రజా అమరావతి);

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి భేటీ ముగిసింది. తెలంగాణలో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ముగ్గురు నేతలు చర్చించారు.


జనసేన, తెలంగాణ బీజేపీ నేతల తిరుగు ప్రయాణమయ్యారు. అమిత్ షా తో భేటీ అనంతరం వచ్చిన విమానంలోనే పయనమయ్యారు. అమిత్ షాతో కలిసిన తరువాత మీడియాతో మాట్లాడకుండానే పవన్, కిషన్ రెడ్డి వెళ్లిపోయారు. భేటీకి ముందు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు 


చర్చల అనంతరం స్పష్టత ఇస్తాం. జనసేన.. ఎన్డీయే భాగస్వామి.. ప్రస్తుతం తెలంగాణ వ్యవహారాలపై చర్చించాం. ఏపీకి సంబంధించి అక్కడి పార్టీ.. లేదా కేంద్ర పార్టీ చూస్తుంది. అక్టోబర్ 1న బీజేపీ సీఈసీ మీటింగ్.. ఆ తర్వాతే రెండో జాబితా విడుదల చేస్తాం. అని కిషన్‌రెడ్డి అన్నారు...

Comments