తాడేపల్లి (ప్రజా అమరావతి);
*యూరోప్ లో వివిధ దేశాలలోని పలు నగరాల్లో అత్యంత వైభవంగా ప్రారంభమైన శ్రీ మలయప్ప స్వామివారి కల్యాణోత్సవాలు
*
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో యూరోప్ మరియు యూకేలలోని పలు నగరాల్లో సెప్టెంబర్ ౩౦ వ తేదీ నుండి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి కల్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కల్యాణోత్సవాలు అక్టోబర్ 15వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందులో భాగంగా సెప్టెంబర్ 30న Frankfurt, అక్టోబర్ 01న Utrecht-Netherlands లో స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది.
తితిదే నుండి వెళ్ళిన అర్చకులు, వేద పండితులు వైఖానస ఆగమం ప్రకారం కల్యాణాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ APNRTS మొదటినుండి తితిదేతో ఒకవైపు, ఆయా నగరాల కార్యనిర్వాహక వర్గాలతో మరోవైపు సమన్వయము చేస్తూ ఎక్కడా, ఏ లోటూ రాకుండా చూసుకుంటోంది. అక్కడి నిర్వాహకులు... భక్తులు, అర్చకులు, వేదపండితులకు, తితిదే అధికారులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది.
Frankfurt లో స్వామివారి కల్యాణ వేదికను ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా అలంకరించారు. అశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యి స్వామివారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. Utrecht-Netherlands లో శ్రీవారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు.
ఈ కల్యాణోత్సవాలకు తెలుగు వారే కాక, ఇతర రాష్ట్రాలకు చెందిన వేల సంఖ్యలో స్వామివారి NRI భక్తులు హాజరై కల్యాణ ఘట్టాన్ని తిలకించి, భక్తిపరవశంతో పులకించారు. హాజరైన భక్తులందరూ స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం భక్తులందరికీ తిరుమల నుండి తీసుకొచ్చిన లడ్డూ ప్రసాదం అందించటం జరిగింది.
ఈ నేపథ్యంలో APNRTS అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనదేశంలోని వివిధ ప్రాంతాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి కల్యాణోత్సవం జరుగుతుందన్నారు. తితిదే చైర్మన్ శ్రీ. భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో శ్రీ ధర్మారెడ్డి గారి సమన్వయ సూచనలతో యూరోప్ మరియు యూకే లోని వివిధ తెలుగు, భారతీయ, ధార్మిక సంస్థల నుండి వచ్చిన అభ్యర్థనల మేరకు తితిదే వారి అనుమతితో ఈ కల్యాణోత్సవాలు జరుగుతున్నాయన్నారు. మరో నాలుగు నగరాల్లో ఈ నెల 07 వ తేదీ నుండి 15 వరకు శ్రీ వేంకటేశ్వర కల్యాణాలు నిర్వహిస్తున్నట్లు శ్రీ వెంకట్ తెలిపారు.
యూరోప్ లోని ఈ 02 నగరాల్లో జరిగిన కల్యాణోత్సవాల్లో Stichting Vasudhaiva Kutumbakam (SVK) ముఖ్యపాత్ర పోషించింది. శ్రీ శివరామ్ తడిగొట్ల, APNRTS రీజనల్ కో ఆర్డినేటర్ శ్రీ కార్తీక్ యార్లగడ్డ పర్యవేక్షణలో శ్రీ. జి. వెంకట కృష్ణా, శ్రీ సూర్య ప్రకాష్ తదితరులు స్వామివారి కల్యాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసారు.
ఈ కార్యక్రమంలో తితిదే నుండి Dy.EE శ్రీ. వి.జె. నాగరాజ, ఆయా నగరాలలోని పలువురు ప్రముఖులు మరియు భారతీయులు పాల్గొన్నారు. SVBC డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి కల్యాణోత్సవం మొత్తం కార్యక్రమాన్ని వెబ్ లైవ్ కవరేజ్ ను సమన్వయము చేసారు.
addComments
Post a Comment