పుట్టపర్తి నియోజకవర్గంలో 31 రహదారుల అభివృద్ధికి రూ. 35 కోట్లను మంజూరు చేస్తున్నాం.

 *పుట్టపర్తి నియోజకవర్గంలో 31 రహదారుల అభివృద్ధికి రూ. 35 కోట్లను మంజూరు చేస్తున్నాం


*


*: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి*


*: పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేయడం చరిత్రాత్మకం*


*: పుట్టపర్తి నియోజకవర్గంలో 6,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు*


*: పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), నవంబర్ 07 (ప్రజా అమరావతి):


శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి బహిరంగ సభ నుంచి మంగళవారం వరుసగా ఐదవ ఏడాది.. రెండవ విడతగా డా.వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు పెట్టుబడి సహాయం పంపిణీని బటన్ నొక్కి నేరుగా జమ చేసే కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.


పుట్టపర్తి నియోజకవర్గంలో 31 రహదారుల అభివృద్ధికి రూ. 35 కోట్లను మంజూరు చేస్తున్నాం : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.


ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రసంగంలో మాట్లాడుతూ పుట్టపర్తి నియోజకవర్గంలోని 31 రహదారుల మరమ్మత్తు పనులకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని, ఇందుకు 35 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, సహాయం కావాలని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కోరారని, రహదారి మరమ్మతు పనులకు అవసరమైన రూ. 35 కోట్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు.


ఈ సందర్భంగా పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ జనహృదయనేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లాకు రావడం ఎంతో శుభదినం అన్నారు. ప్రపంచ నలుమూలల నుంచి భక్తాదులు భగవాన్ శ్రీ సత్య సాయిబాబా నుంచి వరాలు, ఆశీస్సులు పొంది భక్తిపారవశ్యాలతో ఎన్నో మధురమైన జ్ఞాపకాలను తీసుకుని వెళుతుంటారని, ఈ ప్రాంత ప్రజల అభీష్టాన్ని సీఎం తీర్చారని, ఇది చరిత్రాత్మకం అని, చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించబడే గొప్ప అంశం అని, పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాను కానుకగా ఇవ్వడం గొప్ప వరమన్నారు. జిల్లాను ప్రకటించి భగవాన్ శ్రీ సత్య సాయి బాబా చిరకాల వాంఛను ముఖ్యమంత్రి తీర్చారన్నారు. పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా చేయడంతో అన్ని రంగాల్లో ఈ ప్రాంతం అభివృద్ధి సులువుగా జరిగేందుకు అవకాశం దక్కిందన్నారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక భరోసాతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న పుట్టపర్తిలోకి అడుగుపెట్టే ముందు రాత్రి రెండు గంటలసేపు వర్షం పడిందన్నారు. 2014 - 19 వరకు జగనన్న రైతు భరోసా యాత్ర చేపట్టి రైతులకు భరోసా కల్పించడం జరిగిందన్నారు. ఇంతకుముందు 2017 డిసెంబర్ లో నల్లమాడలో పుట్టపర్తి నియోజకవర్గంలో 193 చెరువులను నింపి ఈ ప్రాంతంలోని రైతులను ఆదుకుంటాను అని ప్రతిపక్ష నేతగా జగనన్న చెప్పారని, అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న జిఓ నెంబర్36 ఇచ్చి 864 కోట్ల రూపాయలతో 193 చెరువులను నింపడమే కాకుండా 3 టీఎంసీల హంద్రీనీవా జలాలు మనకు కేటాయించడం జరిగిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 2005లో అనంతపురం, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో రైతులు ఇబ్బందులు పడుతుంటే హంద్రీనీవా సుజల స్రవంతి పథకం వరంగా ఇచ్చారన్నారు. పుట్టపర్తి నియోజకవర్గం లో 26 వేల ఇళ్ల నిర్మాణం జరుగుతోందని, 750 కోట్ల రూపాయలు వెచ్చించి జగనన్న ఆశీస్సులతో అక్కచెల్లెమ్మలు ఇల్లు కట్టుకుంటున్నారన్నారు. జగనన్న ఆశీస్సులతో 1,750 కోట్ల రూపాయలతో ముదిగుబ్బ నుంచి వయా పుట్టపర్తి కోడూరు వరకు ఎన్ హెచ్ 342 పనులు మొదలు పెట్టడం జరిగిందన్నారు. ముద్దనూరు నుంచి హిందూపురం వరకు రహదారి పనులు జగనన్న సీఎం అయ్యాక ప్రారంభించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే బెంగళూరు నుంచి కొడకొండ చెక్పోస్ట్, గోరంట్ల, పుట్టపర్తి రూరల్ మండలం, ఓడిసి, నల్లమాడ, ముదిగుబ్బ, పులివెందుల మీదుగా మేదరమెట్ల వరకు రహదారి నిర్మించడం జరుగుతోందని, 18 వేల కోట్ల రూపాయలు జగనన్న ఆశీస్సులతో ఈ ప్రాంతంలో రహదారుల కోసం వెచ్చిస్తుండడం గర్వకారణం అన్నారు. పుట్టపర్తి నియోజకవర్గం లోని 6000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. దేవుడి దయ, మీ ఆశీస్సులు మాపై ఉన్నాయని, వెనుకబడిన ఈ ప్రాంతంలో 31 రోడ్లు మరమ్మత్తులకు డబ్బులు కావాలని సీఎం కోరారు. రహదారి మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని కోరారు. పుట్టపర్తి నియోజకవర్గంలో మరింత అభివృద్ధి జరిగేందుకు మీరు ఇచ్చిన తోడ్పాటు మరువలేనిదన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.


అనంతరం డా.వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం కింద వరుసగా ఐదవ ఏడాది రెండో విడతగా ఒక్కొక్కరికి 4 వేల రూపాయల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 53.53 లక్షల మంది రైతన్నలకు రూ.2,204 కోట్ల మెగా చెక్కును పంపిణీ చేశారు. తదనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిని జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు సన్మానించారు.


ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి డా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు మరియు రాష్ట్ర కార్మిక, ఉపాధి, ఫ్యాక్టరీస్ శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్, రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, ఎంపీలు గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, ఎమ్మెల్సీలు మంగమ్మ, వై.శివరామిరెడ్డి, ఎమ్మెల్యేలు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, తిప్పేస్వామి, మాలగుండ్ల శంకర్ నారాయణ, సిద్ధారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవిఎస్.నాగిరెడ్డి, రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎడిసిసి బ్యాంకు ఛైర్ పర్సన్ లిఖిత, జాయింట్ కలెక్టర్ టీఎస్.చేతన్, జిల్లా అగ్రి అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ రమణారెడ్డి, సిడబ్ల్యూసి చైర్ పర్సన్ మేడా రామలక్ష్మి, వివిధ శాఖల రాష్ట్ర, జిల్లా అధికారులు, పెద్ద ఎత్తున రైతులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.



Comments