ఆంధ్ర రాష్ట్రంలో జనసేన, టిడిపి.తెలంగాణలో బిజెపి తో జనసేన.

 తాడేపల్లి (ప్రజా అమరావతి );     ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ కార్యాలయంలోని చైర్మన్ అడపా శేషగిరి  ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఈ ఆంధ్ర రాష్ట్రంలో జనసేన, టిడిపి తో రాజకీయంగా ముందుకు వెళ్తూ, అదేవిధంగా తెలంగాణలో బిజెపి తో జనసేన


కలిసి వెళ్లడం ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు.

ఎవరో వ్యక్తులు ఆకతాయిలు చేసినటువంటి పని మొన్న బోట్లు కాలిపోయిన పరిస్థితులు కానీ పవన్ దాన్ని కూడా రాజకీయం చేయడం చాలా బాధాకరం. ఎవరో చేసిన పనికి ప్రభుత్వం మీద రాజకీయం చేస్తున్నాడు, దానిని తప్పుదోవ పట్టే విధంగా నువ్వు నీ అసమానులు రాష్ట్ర ప్రజలు తప్పుదోవ పట్టించే విధానం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు.

నీవు చంద్రబాబు, నీ పప్పు బ్యాచ్ గాని ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక నిరంతరం విమర్శిస్తూ ఉంటున్నావు. నీవు అదే మాదిరిగా తెలంగాణలోనూ ఈ రోజు పోటీ చేస్తున్నారు. నువ్వు ఎన్ని సీట్లు గెలుస్తావ్? ముందు చెప్పు??

 అక్కడ కెసిఆర్ ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించలేకపోతున్నావు, దానికి కారణం మేము చెబుతాం మీ ఆస్తులు ఈ చంద్రబాబు ఆస్తులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి కనుక ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తే నీకు మీ ఆస్తులకి నష్టం కలిగిస్తారని భయం మీకు ఉంది. మీ డ్రామాలు తెలుగు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. నీకు నీ పెంపుడు తండ్రికి బుద్ధి చెప్పే టైం దగ్గర్లోనే ఉంది. ఈ రాష్ట్రంలో ఎవరూ చేయని విధంగా పరిపాలన సాగిస్తున్నటువంటి సచివాలయ వ్యవస్థ లో మార్పులు గాని, అలాగే హెల్త్ సంబంధించి ఆరోగ్య సురక్ష పేద ప్రజలకు ప్రతి ఇంటికి ప్రతి మనిషికి కూడా ఆరోగ్య వసతులను వారి ఇంటి వద్దకే తీసుకెళుతున్న పరిపాలన  విధానం గాని మరియు ముఖ్యంగా ఎడ్యుకేషన్ సంబంధించి నాడు - నేడు అనే ఒక గొప్ప కార్యక్రమం ద్వారా బడులను తీర్చిదిద్దుతున్న విధానం పిల్లలకు అందిస్తున్న క్వాలిటీ విద్యతోపాటు నాణ్యమైన ఆహారం  ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా గమనిస్తుంది.

ఈ రాష్ట్రంలో ఒకే వర్గం వ్యవస్థని దోచేసిన పరిస్థితుల్లో మరి జగన్ గారు పేదరికం నిర్మూలన మీద నా య.సి, నా ఎస్టి, నా బిసి, నా మైనారిటీ అని కాకుండా కాపు, కమ్మ, రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ కులాలలో పేదరికంలో ఉన్న ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి వారి కుటుంబానికి జగన్ ప్రభుత్వం నేడు తోడుగా నిలుచుంది.

కాపు, బలిజ,  తూర్పు కాపు, మున్నూరు కాపు, బలిజన్లో తెగలు, ప్రతి కులాలు ఆలోచించవలసినటువంటి సమయం వచ్చింది. అన్ని కులాల్లోని పేదరికం ఒకటే ఉంటుంది.

 ఎన్నో పార్టీలు వచ్చాయి, ఎంతో మంది ముఖ్యమంత్రి వచ్చారు, కానీ వారి కాలంలో  పేదలకు చేసినటువంటి పనులు, ఏం చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు కానీ జగన్ మోహన్ రెడ్డి గారు పేదరికం ఒక ఎయిడ్స్, కోవిడ్ కన్నా పెద్ద మహమ్మారి గుర్తించి వారిని వాటి నుంచి ఎలా బయటపడాలో నిరంతరం శ్రమిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.

ప్రతివాడు రాజకీయంగా మన కులం మన రాజ్యాధికారం గురించి మాట్లాడుతాడు, కానీ జగన్ గారు పేదవాడి గురించి ఆలోచన

 అది ఏ కులం అని చూడడు, అలాంటి గొప్ప ముఖ్యమంత్రిని  మనం చూస్తున్నాం.....

Comments