రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర గవర్నర్ లకు ఘనస్వాగతం.రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర గవర్నర్ లకు ఘనస్వాగతం
తిరుపతి, నవంబర్ 26 (ప్రజా అమరావతి):  భారత ప్రధాని నరేంద్ర మోడీ కి స్వాగతం పలకడానికి ఆదివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి , రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ వారికి ఘన స్వాగతం లభించింది. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి,   ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి,  డా గురుమూర్తి, రెడ్డెప్ప , ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి , నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, తిరుపతి నగర మేయర్ డా. శిరీష, శాసన సభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, వరప్రసాద్ రావు, ఆదిమూలం, వెంకటే గౌడ, జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, జెసి డి కె బాలాజీ, డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి, తిరుపతి ఎస్పి పరమేశ్వర రెడ్డి, అనంతపురం ఎస్పీ అన్బు రాజన్, నగరపాలక కమిషనర్ హరిత,  నగర డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ఆర్డీవోలు నిశాంత్ రెడ్డి, చంద్రముని, రవి శంకర్ రెడ్డి, తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి, చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి వెంట విమానాశ్రయం చేరుకున్న వారిలో ఉన్నారు.


 రాష్ట్ర ముఖ్యమంత్రి , భారత ప్రధాని నరేంద్ర మోడీ వారికి స్వాగతం పలికిన అనంతరం తిరుగు ప్రయాణం కానున్నారు. రాష్ట్ర గవర్నర్ తిరుమలలో బస చేయనున్నారు.Comments