ఆడుదాం.. ఆంధ్రా క్రీడోత్సవాలను విజయవంతం చేయాలి...



 *ఆడుదాం.. ఆంధ్రా క్రీడోత్సవాలను విజయవంతం చేయాలి...* 



 *క్రికెట్, కబాడీ, ఖొఖో, వాలీబాల్,బ్యాడ్మింటెన్ లలో క్రీడా పోటీలు..* 


 *ఆడుదాం.. ఆంధ్రా లోగో, మస్కట్ ను విడుదల చేసిన ఇన్ చార్జి కలెక్టర్ బి. లావణ్యవేణి..* 


ఏలూరు, నవంబరు,27 (ప్రజా అమరావతి);:గ్రామ, వార్డు సచివాలయ స్ధాయి నుంచి రాష్ట్రస్ధాయి వరకు నిర్వహించే ఆడుదాం.. ఆంధ్రా టోర్నమెంట్ ను  విజయవంతంచేయాలి ఇన్ చార్జి కలెక్టర్ బి. లావణ్యవేణి సంబంధిత అధికారులను ఆదేశించారు. 


 స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం  ఆడుదాం.. ఆంధ్రా లోగో, మస్కట్ ను ఇన్ ఛార్జి కలెక్టర్ బి. లావణ్యవేణి ఆవిష్కరించారు.  


ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న "ఆడుదాం ఆంధ్ర" క్రీడోత్సవాలను జిల్లాలోని అన్ని గ్రామ, మండల నియోజకవర్గ స్ధాయిలో విజయవంతం చేయాలన్నారు. 15 ఏళ్లు పైబడిన అన్ని వయస్సు గల వారిని క్రీడలలో భాగస్వామ్యం చేయడం ద్వారా శారీరక, మానసిక దృఢత్వం, ఆనందాన్ని సొంతం చేసుకోవడం, క్రీడా సంస్కృతిని విస్తృతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోందన్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు .

Comments