*ఏ కష్టమొచ్చినా మీకు తోడుగా ఉంటా...!

 *ఏ కష్టమొచ్చినా మీకు తోడుగా ఉంటా...!


*


*మంగళగిరి సమగ్రాభివృద్ధికి చేయిచేయి కలుపుదాం!*


*తటస్థ ప్రముఖులతో యువనేత నారా లోకేష్*


మంగళగిరి (ప్రజా అమరావతి): నియోజకవర్గ పరిధిలో ఎవరికి ఏ కష్టమొచ్చినా అండగా నిలబడతా, మంగళగిరి సమగ్రాభివృద్ధికి మీ వంతు సహకారం అందించాలని యువనేత నారా లోకేష్ తటస్థ ప్రముఖులకు విజ్ఞప్తిచేశారు. వరుసగా 4వరోజైన శనివారం యువనేత లోకేష్ నియోజకవర్గ పరిధిలోని పలువురు ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తొలుత డోలాస్ నగర్ కు చెందిన పాస్టర్ కుమ్మరకుంట రవికుమార్ ఇంటికి వెళ్లగా, వారి కుటుంబసభ్యులు యువనేతను సాదరంగా ఆహ్వానించారు. పాస్టర్ రవికుమార్ తాడేపల్లితోపాటు నియోజకవర్గ పరిధిలోని డోలాస్ నగర్, ముగ్గురోడ్డు, అంజిరెడ్డి కాలనీ, నులకపేట, పెదకొండూరు, నిడమర్రు, మంగళగిరి పార్కురోడ్డులోని చర్చిలకు క్రైస్తవ మతపెద్దగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో ఆయా చర్చిల వద్ద మౌలిక సదుపాయాలు లేక ప్రతి ఆదివారం ప్రార్థనల కోసం పెద్దఎత్తున తరలివచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని లోకేష్ దృష్టికి తెచ్చారు. మరికొద్దిరోజుల్లో రాబోయే ప్రజాప్రభుత్వం క్రైస్తవ సోదరులకు అండగా ఉంటుందని, మీ బిడ్డగా నన్ను దీవించాలని కోరారు. అనంతరం లోకేష్ మంగళగిరి పట్టణానికి చెందిన ప్రముఖ ఆడిటర్ ఇసునూరు అనిల్ చక్రవర్తిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పద్మశాలి సామాజికవర్గానికి చెందిన అనిల్ చక్రవర్తి మంగళగిరి రోటరీ క్లబ్ కు మొదటి అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం మంగళగిరి రోటరీకి క్లబ్ ట్రైనర్ గా వ్యవహరిస్తూ నియోజకవర్గ పరిధిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర వహించే ఆడిటర్లను కూడా వైసిపి ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తోంది. రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆడిటర్లు తమ కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశం కల్పిస్తామని లోకేష్ చెప్పారు. నియోజకవర్గాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు మీవంతు సహాయ, సహకారాలు అందించాలని కోరారు. చివరిగా మంగళగిరి 30వవార్డుకు చెందిన కొలికపూడి రూఫస్ ను ఆయన నివాసంలో కలుసుకున్నారు.  రూఫస్ గత పాతికేళ్లుగా మంగళగిరిలో శాంతిదూత మినిస్ట్రీస్ పాస్టర్ గా పనిచేస్తూ సామాజికసేవ కార్యక్రమాలు చేపడుతున్నారు. తమ ఇంటికి వచ్చిన లోకేష్ ను రూఫస్ కుటుంబసభ్యులు ఆప్యాయతతో స్వాగతం పలికారు. మంగళగిరిలో ఓటమిపాలైనప్పటికీ గత నాలుగున్నరేళ్లుగా మీలో ఒకడిగా ఉంటూ సొంత నిధులతో సేవలందిస్తున్నానని, మంగళగిరిని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి సహకారం అందించాల్సిందిగా లోకేష్ కోరారు. 


Comments