రాచకొండ పరిధిలో 14 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ.

 *రాచకొండ పరిధిలో 14 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ* హైదరాబాద్:జనవరి 19 (ప్రజా అమరావతి);

రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలువురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ సుధీర్‌బాబు ఈరోజు ఆదేశాలు జారీ చేశారు.


సైబర్‌ క్రైం స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న నందీశ్వర్‌ రెడ్డిని నాచారం పోలీస్‌స్టేషన్‌కు, కుషాయి గూడ ట్రాఫిక్‌ 2లో విధులు నిర్వహిస్తున్న వై.రవీందర్‌ను చర్లపల్లికి, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.ఎలక్షన్‌ రెడ్డిని ఉప్పల్‌కు, సైబర్‌ క్రైంలో పనిచేస్తున్న బి.రాజును పోచారం ఐటీ కారిడార్‌ స్టేషన్‌కు, భువనగిరి రూరల్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.సత్యనా రాయణను మల్కాజిగిరికి బదిలీ చేశారు.


ఇబ్రహీంపట్నం ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.గోవిందరెడ్డిని మేడిపల్లికి, పోచారం ఐటీ కారిడార్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.అశోక్‌ రెడ్డిని ఎస్‌ఓటీ 2కు, మంచాల స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ ఎం.కాశీవిశ్వనాథ్‌ను మీర్‌పేటకు, మీర్‌పేట ఇన్‌స్పెక్టర్‌ కె.కిరణ్‌ కుమార్‌ను సైబర్‌క్రైం ఠాణాకు బదిలీ చేశారు.


వెయిటింగ్‌లో ఉన్న పి.ఆంజనేయులును ఇబ్రహీంపట్నం ఇన్‌స్పెక్టర్‌గా, నాచారం ఇన్‌స్పెక్టర్‌ ఎం.ప్రభాకర్‌ రెడ్డిని సైబర్‌ క్రైం స్టేషన్‌కు, మేడిపల్లి ఇన్‌స్పెక్టర్‌ పి.సైదులును స్పెషల్‌ బ్రాంచ్‌కు, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.రవికుమార్‌ను వనస్థలిపురానికి, చర్లపల్లి ఇన్‌స్పెక్టర్‌ వై.మల్లికార్జున్‌ రెడ్డిని సైబర్‌ క్రైం ఠాణాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Comments