*బీజేపీ ఒక మతతత్వ పార్టీ* *- మతం పేరుతో చిచ్చుపెట్టి ఆ మంటలతో చలి కాచుకోవడమే బీజేపీకి తెలిసిన మంత్రం.* *టీడీపీ, వైసీపీ బీజేపీకి తొత్తులుగా మారాయి.* *-బీజేపీ ఏది చెబితే అందుకు ఎంపీలంతా గంగిరెద్దుల్లా తలలు ఊపుతున్నారు.* *-వైసీపీ,టీడీపీకి ఓట్లు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లే.* *- రాష్ట్రానికి బీజేపీ ఏమి చేసిందో టీడీపీ, వైసీపీ సమాధానం చెప్పాలి.* *- బీజేపీతో దోస్తీ కోసం చంద్రబాబు జగన్ రెడ్డి లు పోలవరాన్ని తాకట్టు పెట్టారు.* *-ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖరరెడ్డి ఆశయాలను కొనసాగించేందుకు నేను రెడీ.* *మీరు రెడీనా?* *-ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.* *విజయవాడ:* బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని,మతం పేరుతో చిచ్చుపెట్టి ఆ మంటలతో చలి కాచుకోవడమే బీజేపీకి తెలిసిన మంత్రమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. విజయవాడ నగరంలోని పోరంకి ఆహ్వానం కళ్యాణ మండపంలో ఆదివారం ఆమె ఏపీసీసీ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ... రాజశేఖరరెడ్డి బిడ్డను నమ్మి సోనియా, రాహుల్, ఖర్గే లు తనకు ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించడం గర్వకారణంగా ఉందన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రెండు సార్లు ఆంధ్ర ప్రదేశ్ కి పీసీసీ గా పనిచేయడంతో పాటు రెండు సార్లు ముఖ్యమంత్రిగా గెలిచారని గుర్తు చేశారు. అదే పీసీసీ పదవిని..ఇంతటి బాధ్యతను వైఎస్సార్ బిడ్డను నమ్మి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ నమ్మి ఇవ్వడం గర్వకారణంగా ఉందన్నారు. ఇంత నమ్మకాన్ని తనపై ఉంచినందుకు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు. గత ఐదు ఏళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉందని, అంతకు ముందు టీడీపీ అధికారంలో ఉందన్నారు. ఈ పదేళ్లలో అభివృద్ధి జరిగిందా అంటే ఎక్కడా లేదన్నారు. రాష్ట్ర విభజన నాటికి రాష్ట్రానికి ఉన్న అప్పులు లక్ష కోట్లు అన్నారు.టీడీపీ అప్పులు రెండు లక్షలు కోట్లు కాగా జగన్ రెడ్డి చేసిన అప్పులు మూడు లక్షల కోట్లు అని గుర్తు చేశారు. అన్ని అప్పులు కలిపితే రాష్ట్రం నెత్తిన సుమారు పది లక్షల కోట్లు అప్పులు అన్నారు. ఇంత అప్పులు చేశారు...ఇన్ని డబ్బులు తెచ్చారని, అయితే అభివృద్ధి బూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనపడదన్నారు. రాజధాని ఉందా..? రాజధాని కట్టగలిగారా ? అని ప్రశ్నించారు.ఆంధ్ర రాష్ట్రానికి కనీసం ఒక్క మెట్రో కూడా లేదని, పదేళ్లలో కనీసం పది కొత్త పెద్ద పరిశ్రమలు కూడా రాలేదన్నారు. పరిశ్రమలు వస్తె మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవన్నారు. కనీసం ఆంధ్రలో రోడ్లు వేసేందుకు కూడా డబ్బులు లేవన్నారు.ఎక్కడ చూసినా ఇసుక మాఫియా,ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా, మద్యం మాఫియాలేనని విమర్శించారు.దోచుకోవడం దాచుకోవడం ఇదే పని అని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చి పదేళ్లు దాటినా ప్రత్యేక హోదా లేదన్నారు.ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఉద్యోగాలు వచ్చేవని, పరిశ్రమలు వచ్చేవన్నారు. హోదా రాలేదు అనడం కంటే..పాలకులు తేలేక పోయారు అనడం కరెక్ట్ అన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి హోదా ఇవ్వడం ద్వారా రెండు వేల కొత్త పరిశ్రమలు వచ్చాయని, హిమాచల్ ప్రదేశ్ లో హోదా ఇవ్వడం ద్వారా పది వేల కొత్త పరిశ్రమలు వచ్చాయని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ఐదేళ్లు హోదా ఇస్తామని అంటే బీజేపీ పదేళ్లు ఇవ్వాలని ఊదర గొట్టారని, పదేళ్లు కాదు పదిహేనేళ్లు హోదా కావాలని చంద్రబాబు అన్నాడని గుర్తు చేశారు. అందుకే బీజేపీ తో చంద్రబాబు పొత్తు పెట్టుకుని మోడీ క్యాబినెట్ లో మంత్రి పదవులు తీసుకున్నారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక హోదా పక్కన పెట్టి ఉద్యమం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారనన్నారు. ఇక జగన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నంత కాలం రోజు హోదా అన్నాడని,ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్రంపై జగన్ రెడ్డి అవిశ్వాసం పెడతానని ప్రకటించారన్నారు. టిడిపి మద్దతు ఇస్తే ..మూకుమ్మడి గా రాజీనామాలు చేస్తే ఎందుకు రాదు హోదా అన్నాడన్నారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఒక్కసారి కూడా ఉద్యమం చేయలేదన్నారు. స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను వైసీపీ తాకట్టు పెట్టిందన్నారు.ప్రత్యేక హోదా కాదు కదా.. కనీసం ఒక్క ప్యాకేజీ కూడా లేదన్నారు. ఈ పాపం ముమ్మాటికీ చంద్రబాబు ది..జగన్ రెడ్డి దేనన్నారు.స్వలాభం కోసం రెండు పార్టీలు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాయని దుయ్యబట్టారు. ఇక రాజధాని అమరావతి అని చంద్రబాబు అన్నాడని, సింగపూర్ చేస్తానని చెప్పి త్రీడీ గ్రాఫిక్స్ చూపించారన్నారు.ఇక జగన్ రెడ్డి గారు మూడు రాజధానులు అన్నాడని, మూడు కాదు కదా ఒక్క రాజధాని కూడా లేదన్నారు. మన రాజధాని ఏది అంటే మనకే తెలియదన్నారు. ఇదేనా చంద్రబాబు,జగన్ రెడ్డి సాధించిన అభివృద్ధి అని ప్రశ్నించారు.పోలవరం ప్రాజెక్ట్ ను ప్రారంబించింది వైఎస్సార్ అని, ఆయన హయాంలో కుడి ఎడమ కాలువలు పూర్తి చేశాడన్నారు. వైఎస్సార్ చనిపోయాక ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు. బీజేపీ తో దోస్తీ కోసం చంద్రబాబు పోలవరాన్ని తాకట్టు పెట్టాడని,ఇటు జగన్ రెడ్డి సైతం బీజేపీ తో దోస్తీ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారన్నారు.బీజేపీ అధికారంలో పదేళ్లు ఉండి...ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిందని, రెండుకోట్ల ఉద్యోగాలలో మన ఆంధ్ర కి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని ప్రశ్నించారు.కొత్త ఉద్యోగాలు కాదు కదా... ఉన్న ఉద్యోగాలు ఊడి పోయే పరిస్థితి నెలకొందన్నారు. ఆంధ్రలో ఒక లక్ష ఉద్యోగాలు కూడా బీజేపీ ఇవ్వలేక పోయిందన్నారు. దేశంలో బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉంటూ రైతులను మోసం చేసిందన్నారు.అప్పు లేని రైతు దేశంలో ఎక్కడా లేడన్నారు.స్విస్ బ్యాంక్ నుంచి డబ్బు వెనక్కు తెచ్చి రైతుల అకౌంట్ లో వేస్తం అని బీజేపీ ప్రకటించిందని, ఒక్క రైతు అకౌంట్ లో అయినా డబ్బులు పడ్డాయా ? అని ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రాన్ని బీజేపీ మోసం చేస్తుంటే...టీడీపీ,వైసీపీ ఎందుకు తొత్తులుగా మారాయనన్నారు.రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీ లు బీజేపీ చెప్పు చేతల్లో ఉన్నారని,ప్రజలు బీజేపీ కి ఓటు వేయక పోయినా... టిడిపి,వైసీపీ ఎంపీ లు బీజేపీ గుప్పిట్లో ఉన్నారన్నారు. బీజేపీ చేతుల్లో ఉన్నప్పుడు ఎంపీ ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి,వైసీపీ కి ఓటు ఎందుకు వేయాలన్నారు.బీజేపీ కి అమ్ముడు పోవడానికి వైసీపీ నుంచి ఎందుకు పోటీ పెట్టాలి...టీడీపీ నుంచి ఎందుకు పోటీకి పెట్టాలన్నారు. ప్రత్యక్షంగా,పరోక్షంగా బీజేపీతో టీడీపీ కి,వైసీపీ కి పొత్తు ఉందని,లేకుంటే ఐదేళ్లలో వైసీపీ ఎందుకు బీజేపీని విమర్శ చేయలేదో చెప్పాలన్నారు.మనకు స్పెషల్ స్టేటస్ ఇచ్చి ఉంటే బీజేపీ కి సపోర్ట్ చేస్తే ప్రజలు సంతోషిస్తారని, పోలవరం ప్రాజెక్ట్ కి పూర్తి స్థాయి నిధులు ఇచ్చి ఉంటే ప్రజలు హర్షించే వాళ్ళన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలలో మన వాట వచ్చి ఉంటే హర్షించే వాళ్ళన్నారు. రైతుల అకౌంట్ లో నిధులు వేసి ఉంటే ప్రజలు హర్షించే వాళ్ళన్నారు.జగన్ రెడ్డి క్రైస్తవుడు అయ్యి ఉండి మణిపూర్ ఘటన మీద స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.మణిపూర్ లో రెండు వేల చర్చిల మీద దాడులు జరిగితే ఒక్క రోజు కూడా విమర్శ చేయలేదన్నారు. క్రైస్తవుల మనోభావాలు దెబ్బతింటూ ఉంటే స్పందించలేదన్నారు.టీడిపి సైతం అదే వైఖరి లో ఉందన్నారు.వైఎస్సార్ బీజేపీ పార్టీకి వ్యతిరేకి అని గుర్తు చేశారు.బీజేపీ మత తత్వ పార్టీ అని, మతం పేరుతో చిచ్చు పెట్టాలి..చలి కాచుకోవాలి..ఇదే బీజేపీ మంత్రమన్నారు. వైఎస్సార్ ఆశయాలు ఒక్క కాంగ్రెస్ లోనే నెరవేరాయని ఏ పార్టీలో నెరవేరలేదన్నారు. వైఎస్సార్ మూలాలు కాంగ్రెస్ పార్టీవే...వైఎస్సార్ ఊపిరి కాంగ్రెస్ పార్టీదేనన్నారు. వైఎస్సార్ ను ప్రేమించే ప్రజలు ఆయన ఆశయాల కోసం నిలబడదామని, వైఎస్సార్ బిడ్డతో చేతులు కలపాలని షర్మిల పిలుపునిచ్చారు. *News By:* *నాగరాజు నాయుడు, జర్నలిస్ట్

 *బీజేపీ ఒక మతతత్వ పార్టీ*


*- మతం పేరుతో చిచ్చుపెట్టి ఆ మంటలతో చలి కాచుకోవడమే బీజేపీకి తెలిసిన మంత్రం.*



*టీడీపీ, వైసీపీ బీజేపీకి తొత్తులుగా మారాయి.*


*-బీజేపీ ఏది చెబితే అందుకు ఎంపీలంతా గంగిరెద్దుల్లా తలలు ఊపుతున్నారు.*


*-వై


సీపీ,టీడీపీకి ఓట్లు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లే.*


*- రాష్ట్రానికి బీజేపీ ఏమి చేసిందో టీడీపీ, వైసీపీ సమాధానం చెప్పాలి.*


*- బీజేపీతో దోస్తీ కోసం చంద్రబాబు జగన్ రెడ్డి లు పోలవరాన్ని తాకట్టు పెట్టారు.*


*-ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖరరెడ్డి ఆశయాలను కొనసాగించేందుకు నేను రెడీ.* *మీరు రెడీనా?*


*-ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.*



విజయవాడ (ప్రజా అమరావతి);

బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని,మతం పేరుతో చిచ్చుపెట్టి ఆ మంటలతో చలి కాచుకోవడమే బీజేపీకి తెలిసిన మంత్రమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. విజయవాడ నగరంలోని పోరంకి ఆహ్వానం కళ్యాణ మండపంలో ఆదివారం ఆమె ఏపీసీసీ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ...  రాజశేఖరరెడ్డి బిడ్డను నమ్మి సోనియా, రాహుల్, ఖర్గే లు తనకు ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించడం గర్వకారణంగా ఉందన్నారు. 

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రెండు సార్లు ఆంధ్ర ప్రదేశ్ కి పీసీసీ గా పనిచేయడంతో పాటు రెండు సార్లు ముఖ్యమంత్రిగా గెలిచారని గుర్తు చేశారు. అదే పీసీసీ పదవిని..ఇంతటి బాధ్యతను వైఎస్సార్ బిడ్డను నమ్మి  కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ నమ్మి ఇవ్వడం గర్వకారణంగా ఉందన్నారు. ఇంత నమ్మకాన్ని తనపై ఉంచినందుకు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు. గత ఐదు ఏళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉందని, అంతకు ముందు టీడీపీ అధికారంలో ఉందన్నారు. ఈ  పదేళ్లలో అభివృద్ధి జరిగిందా అంటే ఎక్కడా లేదన్నారు. రాష్ట్ర విభజన నాటికి రాష్ట్రానికి ఉన్న అప్పులు లక్ష కోట్లు అన్నారు.టీడీపీ అప్పులు రెండు లక్షలు కోట్లు కాగా

జగన్ రెడ్డి చేసిన అప్పులు మూడు లక్షల కోట్లు అని గుర్తు చేశారు. అన్ని అప్పులు కలిపితే రాష్ట్రం నెత్తిన  సుమారు పది లక్షల కోట్లు అప్పులు అన్నారు. ఇంత అప్పులు చేశారు...ఇన్ని డబ్బులు తెచ్చారని, అయితే అభివృద్ధి బూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనపడదన్నారు. రాజధాని ఉందా..? రాజధాని కట్టగలిగారా ? అని ప్రశ్నించారు.ఆంధ్ర రాష్ట్రానికి కనీసం ఒక్క మెట్రో కూడా లేదని,  పదేళ్లలో కనీసం పది కొత్త పెద్ద పరిశ్రమలు కూడా రాలేదన్నారు. పరిశ్రమలు వస్తె మన బిడ్డలకు  ఉద్యోగాలు వచ్చేవన్నారు. కనీసం ఆంధ్రలో రోడ్లు వేసేందుకు కూడా డబ్బులు లేవన్నారు.ఎక్కడ చూసినా ఇసుక మాఫియా,ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా, మద్యం మాఫియాలేనని విమర్శించారు.దోచుకోవడం దాచుకోవడం ఇదే పని అని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చి

పదేళ్లు దాటినా ప్రత్యేక హోదా లేదన్నారు.ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఉద్యోగాలు వచ్చేవని, పరిశ్రమలు వచ్చేవన్నారు.

హోదా రాలేదు అనడం కంటే..పాలకులు తేలేక పోయారు అనడం కరెక్ట్ అన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి హోదా ఇవ్వడం ద్వారా రెండు వేల కొత్త పరిశ్రమలు వచ్చాయని,

హిమాచల్ ప్రదేశ్ లో హోదా ఇవ్వడం ద్వారా పది వేల కొత్త పరిశ్రమలు వచ్చాయని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ఐదేళ్లు హోదా ఇస్తామని అంటే బీజేపీ పదేళ్లు ఇవ్వాలని ఊదర గొట్టారని,  పదేళ్లు కాదు పదిహేనేళ్లు హోదా కావాలని చంద్రబాబు అన్నాడని గుర్తు చేశారు. అందుకే బీజేపీ తో చంద్రబాబు  పొత్తు పెట్టుకుని మోడీ క్యాబినెట్ లో మంత్రి పదవులు తీసుకున్నారన్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక హోదా పక్కన పెట్టి ఉద్యమం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారనన్నారు.

ఇక జగన్ రెడ్డి  ప్రతిపక్ష నేతగా ఉన్నంత కాలం రోజు హోదా అన్నాడని,ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్రంపై జగన్ రెడ్డి అవిశ్వాసం పెడతానని ప్రకటించారన్నారు. టిడిపి మద్దతు ఇస్తే ..మూకుమ్మడి గా రాజీనామాలు చేస్తే ఎందుకు రాదు హోదా అన్నాడన్నారు.

జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఒక్కసారి కూడా ఉద్యమం చేయలేదన్నారు.

స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను వైసీపీ తాకట్టు పెట్టిందన్నారు.ప్రత్యేక హోదా కాదు కదా.. కనీసం ఒక్క ప్యాకేజీ కూడా లేదన్నారు.

ఈ పాపం ముమ్మాటికీ చంద్రబాబు ది..జగన్ రెడ్డి దేనన్నారు.స్వలాభం కోసం రెండు పార్టీలు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాయని దుయ్యబట్టారు. ఇక రాజధాని అమరావతి అని చంద్రబాబు అన్నాడని, సింగపూర్ చేస్తానని చెప్పి త్రీడీ గ్రాఫిక్స్ చూపించారన్నారు.ఇక జగన్ రెడ్డి గారు మూడు రాజధానులు అన్నాడని, మూడు కాదు కదా ఒక్క రాజధాని కూడా లేదన్నారు.

మన రాజధాని ఏది అంటే మనకే తెలియదన్నారు.

ఇదేనా చంద్రబాబు,జగన్ రెడ్డి సాధించిన అభివృద్ధి అని ప్రశ్నించారు.పోలవరం ప్రాజెక్ట్ ను ప్రారంబించింది వైఎస్సార్ అని, ఆయన హయాంలో కుడి ఎడమ కాలువలు పూర్తి చేశాడన్నారు. వైఎస్సార్ చనిపోయాక ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు.

బీజేపీ తో దోస్తీ కోసం చంద్రబాబు పోలవరాన్ని తాకట్టు పెట్టాడని,ఇటు జగన్ రెడ్డి సైతం బీజేపీ తో దోస్తీ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారన్నారు.బీజేపీ అధికారంలో పదేళ్లు ఉండి...ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిందని, రెండుకోట్ల ఉద్యోగాలలో మన ఆంధ్ర కి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని ప్రశ్నించారు.కొత్త ఉద్యోగాలు కాదు కదా... ఉన్న ఉద్యోగాలు ఊడి పోయే పరిస్థితి నెలకొందన్నారు. ఆంధ్రలో ఒక లక్ష ఉద్యోగాలు కూడా బీజేపీ ఇవ్వలేక పోయిందన్నారు. దేశంలో బీజేపీ పదేళ్లుగా  అధికారంలో ఉంటూ రైతులను మోసం చేసిందన్నారు.అప్పు లేని రైతు దేశంలో ఎక్కడా లేడన్నారు.స్విస్ బ్యాంక్ నుంచి డబ్బు వెనక్కు తెచ్చి రైతుల అకౌంట్ లో వేస్తం అని బీజేపీ ప్రకటించిందని, ఒక్క రైతు అకౌంట్ లో అయినా డబ్బులు పడ్డాయా ? అని ప్రశ్నించారు.

ఆంధ్ర రాష్ట్రాన్ని బీజేపీ మోసం చేస్తుంటే...టీడీపీ,వైసీపీ ఎందుకు తొత్తులుగా మారాయనన్నారు.రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీ లు బీజేపీ చెప్పు చేతల్లో ఉన్నారని,ప్రజలు బీజేపీ కి ఓటు వేయక పోయినా... టిడిపి,వైసీపీ ఎంపీ లు బీజేపీ గుప్పిట్లో ఉన్నారన్నారు.

బీజేపీ చేతుల్లో ఉన్నప్పుడు ఎంపీ ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి,వైసీపీ కి ఓటు ఎందుకు వేయాలన్నారు.బీజేపీ కి అమ్ముడు పోవడానికి వైసీపీ నుంచి ఎందుకు పోటీ పెట్టాలి...టీడీపీ నుంచి ఎందుకు పోటీకి పెట్టాలన్నారు.

ప్రత్యక్షంగా,పరోక్షంగా బీజేపీతో  టీడీపీ కి,వైసీపీ కి పొత్తు ఉందని,లేకుంటే  ఐదేళ్లలో వైసీపీ ఎందుకు బీజేపీని విమర్శ చేయలేదో చెప్పాలన్నారు.మనకు స్పెషల్ స్టేటస్ ఇచ్చి ఉంటే బీజేపీ కి సపోర్ట్ చేస్తే ప్రజలు సంతోషిస్తారని, పోలవరం ప్రాజెక్ట్ కి పూర్తి స్థాయి నిధులు ఇచ్చి ఉంటే ప్రజలు హర్షించే వాళ్ళన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలలో మన వాట వచ్చి ఉంటే హర్షించే వాళ్ళన్నారు.

రైతుల అకౌంట్ లో నిధులు వేసి ఉంటే ప్రజలు హర్షించే వాళ్ళన్నారు.జగన్ రెడ్డి క్రైస్తవుడు అయ్యి ఉండి మణిపూర్ ఘటన మీద స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.మణిపూర్ లో రెండు వేల చర్చిల మీద దాడులు జరిగితే ఒక్క రోజు కూడా విమర్శ చేయలేదన్నారు.

క్రైస్తవుల మనోభావాలు దెబ్బతింటూ ఉంటే స్పందించలేదన్నారు.టీడిపి సైతం అదే వైఖరి లో ఉందన్నారు.వైఎస్సార్ బీజేపీ పార్టీకి వ్యతిరేకి అని గుర్తు చేశారు.బీజేపీ మత తత్వ పార్టీ అని, మతం పేరుతో చిచ్చు పెట్టాలి..చలి కాచుకోవాలి..ఇదే బీజేపీ మంత్రమన్నారు.

వైఎస్సార్ ఆశయాలు ఒక్క కాంగ్రెస్ లోనే నెరవేరాయని

 ఏ పార్టీలో నెరవేరలేదన్నారు.

వైఎస్సార్ మూలాలు కాంగ్రెస్ పార్టీవే...వైఎస్సార్ ఊపిరి కాంగ్రెస్ పార్టీదేనన్నారు.

వైఎస్సార్ ను ప్రేమించే ప్రజలు ఆయన ఆశయాల కోసం నిలబడదామని, వైఎస్సార్ బిడ్డతో చేతులు కలపాలని షర్మిల  పిలుపునిచ్చారు.


Comments