ప్రతి పేదవానికి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేకూరాలి. మచిలీపట్నం,  జనవరి 10. (ప్రజా అమరావతి):


ప్రతి పేదవానికి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేకూరాల


న్న ఉద్దేశంతోనే వికసిత భారత్ సంకల్ప యాత్ర చేపట్టామని కేంద్ర ఓడరేవులు షిప్పింగ్ జలమార్గాలు పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీపాద యశోనాయక్ పేర్కొన్నారు.


బుధవారం జిల్లా పంచాయతీ అధికారి, కార్యక్రమం నోడల్ అధికారి నాగేశ్వర్ నాయక్ ఆధ్వర్యంలో అవనిగడ్డ  నియోజకవర్గంలోని మండల కేంద్రమైన కోడూరు టిటిడి కళ్యాణ మండపం ప్రాంగణంలో వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం నిర్వహించారు.


తొలుత కేంద్ర మంత్రివర్యులు ఆ ప్రాంగణంలో  డ్రోన్ ద్వారా పంట పొలాలకు మందులు వెదజల్లే ప్రక్రియను పరిశీలించారు. తదుపరి అక్కడే ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్యశాఖ, తపాలా, వ్యవసాయ, స్త్రీ శిశు సంక్షేమ,  ఆధార్ కార్డు, ఉజ్వల యోజన, నెహ్రూ యువజన మై భారత వాలంటీర్ నమోదు ప్రదర్శనశాలలు సందర్శించారు. 


తదుపరి ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ధాన్యాలు కూరగాయల ప్రదర్శన చక్రాన్ని మంత్రి పరిశీలించారు.


అనంతరం విద్యార్తినులు వందేమాతరం గీతాలాపన చేయగా మంత్రి  జ్యోతి ప్రజ్వలన గావించి సభా కార్యక్రమాన్ని ప్రారంభించారు.


తదనంతరం విద్యార్థినులు స్వాగత నృత్యం ప్రదర్శించారు.


నేలతల్లిని ఎలా సంరక్షించుకోవాలో సందేశమిచ్చే చిన్నారుల నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. ప్రాంగణమంతా ప్రజలతో కిటకిటలాడుతూ పండుగ వాతావరణం నెలకొంది.


ఈ సందర్భంగా కేంద్ర మంత్రివర్యులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ

దేశ ప్రగతి పేద ప్రజల అభ్యున్నతి ద్వారానే సాధ్యపడుతుందన్నారు.

ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు


సంక్షేమ పథకాలు గ్రామాల్లో పేద ప్రజలు అందరికీ తెలియజేసి ఎవరికైనా అందకుంటే వాటి లబ్ధి చేకూర్చడానికి భారత్ సంకల్ప యాత్రను ప్రభుత్వం చేపట్టిందన్నారు.


దేశంలో 80 కోట్ల మంది భారతీయులకు గరీబ్ కళ్యాణ్ అన్న  యోజన కింద ఉచిత బియ్యం అందించి ఆహార  భద్రత హామీ కల్పించిందన్నారు.


అలాగే పేదవారు నివసించడానికి పి ఎం ఏ వై కింద 3 కోట్ల కుటుంబాలకు ఇల్లు నిర్మించి ఇచ్చామన్నారు.


జల జీవన్ మిషన్ కింద 12 కోట్ల కుటుంబాలకు స్వచ్ఛమైన నీరును అందించామని రాబోయే రోజుల్లో నూరు శాతం గ్రామాలకు నీరు అందిస్తామన్నారు.


 జన్ధన్ యోజన కింద 50 కోట్ల మందికి సున్న నిల్వతో బ్యాంకు ఖాతాలను తెరిపించడం జరిగిందన్నారు. త్వరలో నూరు శాతానికి చేరబోతుందన్నారు.


పిఎం కిసాన్ సన్మాన్ ద్వారా 12 కోట్ల మంది రైతులకు  సంవత్సరానికి 6 వేల రూపాయల పెట్టుబడి సహాయం అందిస్తున్నామన్నారు.


ఆర్థికంగా పేదలైన వారికి ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్ను

 కల్పించామన్నారు.

 

పీఎం స్వానిధి పథకం కింద 54 లక్షల మంది మధ్యతరగతి చిన్న తరహా వీధి వ్యాపారస్తులకు తక్కువ వడ్డీకే రుణాలు అందించామన్నారు.


విశ్వకర్మ పథకం కింద 3 లక్షల వరకు వివిధ చేతివృత్తుల వారికి బ్యాంకుల ద్వారా హామీ రహిత రుణాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టామన్నారు.

దీంతోపాటు  భృతి సహిత నైపుణ్య శిక్షణ కోసం 15 వేల  రూపాయల విలువైన పరికరాలు కూడా అందిస్తున్నామన్నారు


ఫసల్ బీమా యోజన  కింద 0.25 శాతం కట్టించుకుని మిగతా సొమ్ము కేంద్ర ప్రభుత్వం భరించి కనీస మద్దతు ధర ఒకటిన్నర రెట్లు కల్పిస్తోందన్నారు.


తక్కువ వడ్డీకే కిసాన్ క్రెడిట్ కార్డుదారులకు రుణాల అవకాశం కల్పిస్తున్నామన్నారు.


కేంద్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా పీఎం ఉజ్వల పథకం కింద 10 కోట్ల మంది మహిళలకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశామన్నారు. 


మహిళలను గౌరవించి రక్షణ కల్పించడానికి 12 కోట్ల  మరుగుదొడ్లు నిర్మించి ఇచ్చామన్నారు


పీఎం మాతృ వందనా పథకం కింద 3 కోట్ల మందికి లబ్ధి చేకూరిందన్నారు.


ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 10 వ స్థానంలో ఉన్న మన దేశాన్ని 5వ  స్థానానికి తీసుకొచ్చామని రానున్న రోజుల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి అగ్రగామి దేశంగా నిలవడానికి అందరూ ముందుకు రావాలన్నారు.


నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక మన శక్తి సామర్ధ్యాలను గుర్తించి ప్రపంచంలో ఎవరైనా మన దేశాన్ని సంప్రదిస్తున్నారన్నారు.


గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఎక్కడ అవినీతి జరగలేదన్నారు.

.

సంకల్ప యాత్ర జిల్లా  ప్రభారి(ఇంచార్జ్) కేంద్ర ఐఏఎస్ అధికారి ఎం రామచంద్రుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశయం మేరకు 2047 సంవత్సరం నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా తయారు కావడానికి అందరూ సంకల్పంతో ముందడుగు వేయాలన్నారు


కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న అనేక పథకాలను ప్రజలందరికీ అవగాహన కల్పించాలన్నదే సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశం అన్నారు.


అంతేకాకుండా గ్రామాల్లో గాని పట్టణాల్లో గాని కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇంకా ఎవరికైనా పొందకుంటే  వారికి లబ్ధి చేకూరేలా చేయాలన్నదే ప్రధాన ఉద్దేశం అన్నారు


ఇందుకోసం ప్రతి గ్రామపంచాయతీలో గ్రామసభలు నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు  అవి వారు  పొంది ఆర్థికంగా ఎదగాలన్నారు.


మచిలీపట్నం ఆర్డిఓ ఎం. వాణీ స్వాగతోపన్యాసం చేస్తూ  జిల్లాలో చేపట్టిన కేంద్ర ప్రభుత్వ 17 ప్రతిష్టాత్మక పథకాల కింద లబ్ధిదారుల వివరాలను తెలియజేశారు. 


ఈ సందర్భంగా పీఎంజేఏవై ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులు, పీఎం ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లు లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు


జల జీవన్ మిషన్లో నూరు శాతం ఫలితాలు సాధించి ఇంటింటికి కులాయి ఏర్పాటు చేసిన సౌత్ చిరువోలు సర్పంచ్ సనకా సుబ్రహ్మణ్యేశ్వర రావు,, జాతీయ జల  క్రీడల్లో ,అథ్లెటిక్స్ లో ప్రతిభ చూపిన ఎన్ గాయత్రి ఎన్ భాను, రోహిత్ లను మంత్రి ఘనంగా సత్కరించారు.


పి ఎం ఎం.వి వై,, పి ఎం పోషణ అభియాన్,  పిఎం కిసాన్ సమ్మాన్,  పిఎంఏవై, పీఎం వుజ్వల పథకాల కింద లబ్ధి పొందిన ఏ. రమాదేవి, అద్దంకి రమ్య, మెండే అర్జునరావు, జేటి చిన వెంకటేశ్వరరావు, బొర్ర రాధిక తమకు ఆ పథకాలు ఏ విధంగా ఉపయోగపడ్డాయో వివరించారు.


అనంతరం కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ రూపొందించిన 2024 క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించారుఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి ఆర్. వెంకట రావు,  ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డా. సతీష్,  ఎంపీపీ కొండవీటి వెంకట  కుమారి, జడ్పిటిసి సత్యనారాయణ, సర్పంచ్ వెన్నా షైనీ, పలువురు ప్రజలు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. Comments