అంతర్జాతీయస్ధాయిలో ప్రతిబింబించేలా...

 

పాలసముద్రం, శ్రీసత్యసాయి జిల్లా (ప్రజా అమరావతి);



*శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని పాలసముద్రం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కస్టమ్స్, ఇండైరెక్ట్‌ టాక్సెస్‌ అండ్‌ నార్కోటిక్స్‌ అకాడమీని ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్రమోదీ.*


*కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్‌ శ్రీ జస్టిస్‌ ఎస్‌.అబ్జుల్‌ నజీర్, ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్, కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలాసీతారామన్, కేంద్ర ఆర్ధికశాఖ సహాయమంత్రులు పంకజ్‌ చౌదరి, చా.భగవత్‌ కిషన్రావ్‌ కరాడ్, రాష్ట్ర మంత్రులు ఇతర ప్రజా ప్రతినిధులు.*


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:*


గౌరవనీయులైన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీగారికి, రాష్ట్ర గవర్నర్‌ రాష్ట్ర గవర్నర్‌ శ్రీ జస్టిస్‌ ఎస్‌.అబ్జుల్‌ నజీర్‌ గారికి, కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలాసీతారామన్‌ గారికి, కేంద్ర ఆర్ధికశాఖ సహాయమంత్రులు పంకజ్‌ చౌదరిగారికి, భగవత్‌ కిషన్రావ్‌ కరాడ్‌ గారికి, నా మంత్రివర్గ సహచరులకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు, ఆహుతులకు హృదయపూర్వక నమస్సులు. 



నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్‌ టాక్సెస్‌ & నార్కోటిక్స్‌ అకాడమీ రెండో క్యాంపస్‌ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. కస్టమ్స్‌ ఇన్‌డైరెక్ట్‌ టాక్సెస్‌ అండ్‌ నార్కోటిక్స్‌ కంట్రోల్‌లో కెపాసిటీ బిల్డింగ్‌లో సమగ్ర శిక్షణ అందించే ఈ సంస్ధ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, సీబీఐసీ వంటి సంస్ధలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అధికారుల కోసం ఉద్దేశించినది.


అత్యంత వెనుకబడిన జిల్లాలో ఒకటైన అనంతపురం జిల్లాలో ప్రపంచస్ధాయి సంస్ధ అయినటువంటి ఈ అకాడమీని నెలకొల్పినందుకు ఈ సందర్బంగా ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారికి నా ప్రగాఢ ధన్యవాదాలు. ఈ సంస్ధను ఇక్కడకు తీసుకొచ్చే గొప్ప ప్రయత్నం చేయడమే కాకుండా, ఇది సాధించేందుకు శ్రీమతి నిర్మాలాసీతారామన్‌  అనేక సందర్భాలలో ఇక్కడికి రావడం, దీని కోసం మంచి ప్రయత్నం చేయడం మన కళ్లెదుటే కనిపించే వాస్తవం. మన రాష్ట్రంలో ఏర్పాటవుతున్న ఇలాంటి మంచి సంస్ధ మన రాష్ట్రం పేరు, ప్రతిష్టను మన దేశంలో కాకుండా, అంతర్జాతీయస్ధాయిలో ప్రతిబింబించేలా...


అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అన్నింటిని అనుసంధానించే గొప్ప సంస్ధగా నిలుస్తుంది. దీన్ని తీసుకొచ్చినందుకు మరొక్కసారి శ్రీ నరేంద్రమోదీగారికి, శ్రీమతి నిర్మలాసీతారామన్‌ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

Comments