ఏఫ్రిల్ 3 న సీజర్ పై సి.ఎస్,డిజిపిలతో ఇ.సి. సమీక్ష.

 *ఏఫ్రిల్ 3 న సీజర్ పై సి.ఎస్,డిజిపిలతో ఇ.సి. సమీక్ష


*

*•ఎలక్షన్ సీజర్  మేనేజ్మంట్ సిష్టం వినియోగాన్ని విస్తృత పర్చండి*

*•ఎన్నికల విధులో పాల్గొనే ఉద్యోగుల ఆప్షన్ మేరకు పోస్టల్ బ్యాలెట్  అవకాశం* 

*రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా*


అమరావతి, మార్చి22 (ప్రజా అమరావతి): వచ్చే నెల 3 వ తేదీన సీజర్ అంశంపై సి.ఎస్., డిజిపిలతో భారత ఎన్నికల సంఘం అధికారులు సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో ఎలక్షన్ సీజర్ మేనేజ్మంట్ సిష్టం వినియోగాన్ని విస్తృత స్థాయిలో మెరుగు పర్చాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన మీడియో కాన్ఫరెన్సు నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు తీరును సమీక్షించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీజర్ అంశంపై ఎన్ఫోర్సుమెంట్ ఏజన్సీలను అప్రమ్తతం చేయాలని, జిల్లా పరిధుల్లోనే కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో కూడా నిఘాను పటిష్టపర్చాలన్నారు. ప్రతి సరిహద్దు చెక్ పోస్టు వద్ద  కనీసం ఒక కెమెరాతో స్టాటిక్ సర్వలెన్సు టీమ్ ను ఉంచాలన్నారు.  


భారత ఎన్నికల సంఘం జారీచేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం దాదాపు 33 నిత్యావసర సేవల శాఖల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించడం జరిగిందన్నారు. వీటిలో ముఖ్యంగా పోలీస్, విద్యుత్, రవాణా, పోస్టల్  తదితర శాఖలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే మీడియా ప్రతినిధులతో పాటు ఆయా శాఖల ఉద్యోగులకు వారి విజ్ఞప్తి మేరకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించాలని ఆదేశించారు. 


ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో నున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు నిర్వహించే ఎటు వంటి కార్యక్రమాలకైనా ముందుగా అనుమతి తప్పని సరిగా పొందాల్సి ఉందన్నారు. అయితే నేరుగా గానీ, ఎన్కోర్ (Encore) పోర్టల్ ద్వారా గానీ అందే ధరఖాస్తులను వెంటనే పరిశీలించి సకాలంలో అనమతులను మంజూరు చేయాలని ఆదేశించారు.  శాంతి భద్రతల నిర్వహణ విషయంలో ఎంతో అప్రమ్తతంగా ఉండాలని, ఎటు వంటి దుర్ఝటనలకు తావులేకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దురదృష్టవశాత్తు ఎటు వంటి దుర్ఝటనలు జరిగినా తక్షణమే తగు చర్య తీసుకోవడంతో పాటు ఆ సంఘటనకు సంబందించిన వాస్తవ నివేదితను వెంటనే తమ పంపాలన ఆదేశించారు. 


ఓటర్ల జాబితా నుండి పేర్లను తొలగింపుకు సంబందించి పెండింగ్ లో ఉన్న ఫార్ము-7 లను మరియు వివరాలను సరిదిద్దేందుకు  సంబందించి పెండింగ్ లో నున్న ఫార్ము-8 లను చట్టబద్దమైన విదానంలో  ఈ నెల 26 లోపుగా పరిష్కరించాలని ఆదేశించారు. నూతన ఓటర్ల నమోదు విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని, చివరి నిమిషంలో హడావుడిగా ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టవద్దని, క్రమ పద్దతిలో వ్యక్తిగతంగా ధాఖలు చేసిన ఫార్ము-6 లను క్షుణ్ణంగా పరిశీలించిన తదుపరి మాత్రమే నూతన ఓటర్లుగా  నమోదు చేయాలని సూచించారు. 


ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుండి ప్రతి రోజూ తొమ్మిది నివేదికలను భారత ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉందని, ఈ నివేదికలు పంపే విషయంలో ఏమాత్రం అలక్ష్యం వహించకుండా సకాలంలో నివేదికలను అందజేయాలని ఆదేశించారు. 

 

ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు  అదనపు సీఈవో  లు పి.కోటేశ్వరరావు, ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్, జాయింట్  సీఈవో వెంకటేశ్వరరావు , డిప్యూటీ సీఈవోలు కె. విశ్వేశ్వరరావు, మల్లిబాబు, సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

                


Comments