ఏ విధమైన ప్రచారాలకైన అనుమతులు తప్పనిసరి.రాజమహేంద్రవరం, (ప్రజా అమరావతి); ఏ విధమైన ప్రచారాలకైన అనుమతులు తప్పనిసరి రాజకీయ పార్టీలు అనుమతుల కోసం అవసరమైన పత్రాలు అందజేయాలి


** ఉల్లంఘన పై ఫిర్యాదులు చేసే విధానం లో 1950,  సి విజిల్ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలి


** సి విజిల్ యాప్ ద్వారా చేసే వారి విషయంలో గోప్యత పాటించడం జరుగుతుంది


** తప్పుడు ఫిర్యాదుల చెయ్యరాదు.... 


** ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అందుబాటులో టోల్ ఫ్రీ నెంబర్


** ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యాలు ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలి


** గోడలపై ఎటువంటి రాతలు రాయకూడదు


**  ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యాలు నిబంధనలు పాటించాలి 


** సి విజిల్ యాప్ ద్వారా 182 ఫిర్యాదులు


** ఎన్ కోర్ ద్వారా 115 దరఖాస్తులు , 61 కి ఆమోదం, 33 తిరస్కరణ 


- జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత
ఎన్నికల నిర్వహణా వ్యవస్థ నేపధ్యంలో జవాబుదారీతనం కలిగి ఉండేలా జిల్లాలో అన్ని విభాగాలను జాగురత చెయ్యడంతో పాటు సీజర్ (స్వాధీనం) , ఎన్ కోర్ మేనేజ్మెంట్ (అనుమతులు) మరియు సి విజిల్ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతోందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత సోమవారం ఒక ప్రకటనలో  పేర్కొన్నారు.ఎన్నికల ప్రక్రియ లో (సీజర్) స్వాధీనం చేసుకున్న వాటి వివరాలు తెలియ చేస్తూ, ఏ ఒక్కరూ కూడా నగదు రూపంలో ₹.50 వేలు మించి దగ్గర ఉంచుకొరాదని, ఒక వేళ పెద్ద మొత్తంలో నగదు ఉన్న యెడల తగిన ఆధారాలు తనిఖీలు నిర్వహించే అధికారులకి చూపించాలని అన్నారు.  జిల్లాలో ఇప్పటి వరకు నిడదవోలు నియోజక వర్గం పరిధిలో ముగ్గురు వ్యక్తులు ₹.2 లక్షలు , ₹. ఒక లక్షా 14 వేలు, ₹.6 లక్షల 30 వేలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రూ.3 లక్షల 14 వేలు విడుదల చెయ్యడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ప్రచారం కోసం వొచ్చే అభ్యర్థనలను 48 గంటల్లో మార్గదర్శకాలు మేరకు అనుమతులను సింగిల్ విండో విధానం ద్వారా జారీ చెయ్యడం, అసంపూర్తి గా ఉన్నా వాటినీ తిరస్కరించడం జరుగుతోందని అన్నారు. 


 *ఎన్ కోర్ :* 


సింగిల్ విండో విధానం లో సువిధా లో వస్తున్న దరఖాస్తులను పరిశీలించి మార్గదర్శకాల మేరకు అనుమతులను జారీ చేస్తున్నాం అని పేర్కొన్నారు. సక్రమంగా లేని వాటి విషయంలో తగిన సూచనలు చెయ్యడం జరుగుతోందని అన్నారు. సంబంధిత అధికారులు వాటినీ పరిశీలించి నిర్దారణ చెయ్యడం, అవసరమైన ధ్రువపత్రాలు పరిశీలించి ఆమేరకు అనుమతులను జారీ చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలు తప్పని సరిగా అనుమతుల కోసం అవసరమైన పత్రాలు అందజేయాల్సి ఉంటుందన్నారు. వాటినీ ఎన్ కోర్ యాప్ ద్వారా అప్లోడ్ చెయ్యాల్సి ఉంటుంది.


జిల్లాలో ఇప్పటి వరకు 7 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో ఎన్ కోర్ ద్వారా 115 అభ్యర్ధనలు రాగా వాటిలో 61 కి అనుమతులు జారీ చేశామని, 33 తిరస్కరించగా , 14 పరిశీలనలో, 7 పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు. నియోజక వర్గాల వారీగా అనపర్తి 11 దరఖాస్తులలో 10 ఆమోదం, ఒకటి తిరస్కృతి, రాజానగరం 37 దరఖాస్తులు, 22 ఆమోదం, 14 తిరస్కృతి, ఒకటి పెండింగ్ ; రాజమండ్రి సిటీ 30 దరఖాస్తులు, 7 ఆమోదం, 11  తిరస్కృతి, 6 పరిశీలనలో, 6  పెండింగ్ ; రాజమండ్రీ రూరల్  4 దరఖాస్తులు, 3  ఆమోదం, ఒకటి తిరస్కృతి ; కొవ్వూరు 7 దరఖాస్తులు, 5 ఆమోదం, 2 తిరస్కృతి , నిడదవోలు 17 దరఖాస్తులు, 10 ఆమోదం, 7 పరిశీలనలో ;  9 దరఖాస్తులు, 4  ఆమోదం, 4 తిరస్కృతి, 1 పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. 


 *సి విజిల్ :* 


సి విజిల్ యాప్ ద్వారా ఆదివారం రాత్రి వరకు 182 ఫిర్యాదులు అందాయని, సోమవారం రాజమండ్రీ రూరల్ రెండు, నిడదవోలు నుంచి ఒక ఫిర్యాదు వొచ్చినట్లు మాధవీలత తెలియ చేశారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు , ప్రజలు ప్రతి ఒక్కరూ జిల్లా యంత్రాంగానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందచేయాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ ప్రకటనలు, ప్రచారం కోసం అనుమతులు తప్పనిసరి అని తెలియ చేశారు. ప్రచారం కోసం గోడలపై ఎటువంటి వ్రాతలు రాయకూడదు అని, అటువంటి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని పేర్కొన్నారు.  *ప్రింటింగ్ ప్రెస్ వారికీ:* 


వివిధ ప్రచారాలు నిమిత్తం ప్రింటింగ్ చేసే కరపత్రాలు, ఇతర ప్రచురణల సమాచారం ప్రజా ప్రాతినిధ్యం చట్టం 1951 లోని ఆర్టికల్ 127 ఏ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ప్రచురించిన కరపత్రాలు సంఖ్య, ప్రింటర్ పేరు, చిరునామా లో తదితర సమగ్ర సమాచారం ముద్రించడం, మూడు రోజులలో ఆర్వో లకి నివేదికలు పంపించాల న్నారు.


 *ఎక్సైజ్, పోలీసు అధ్వర్యంలో..* 


మద్యం , గంజా, తదితర రవాణా లపై జిల్లాలో 7 చెక్ పోస్టులు ద్వారా తనిఖీలు, జిల్లాలో 63 ఫ్లైయింగ్  , సర్వైవల్ , వీడియో సర్వైవల్ బృందాలు తనిఖీలు నిర్వహించడానికి అనుగుణంగా కార్యచరణ రూపొందించడం జరిగిందన్నారు. ఎక్సైజ్, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో 65 దాడులు నిర్వహించి  ₹.9 లక్షల 14 వేల ఖరీదైన 3,047 లీటర్లు మద్యం సీజ్ చెయ్యడం 72 మందిని అరెస్ట్ చేశామన్నారు. రు.,, లక్షా 69 వేల ఖరీదైన 33,800 లీటర్ల బెల్లం ఊట ధ్వసం చేశామన్నారు. డ్యూటీ పెయిడ్ మద్యం (అనధికార బెల్ట్ షాపులు) నిర్వహిస్తున్న 95 మంది పై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. అందులో భాగంగా రు.2,27,183 లు విలువైన 672 లీటర్ల మద్యం సీజ్ చెయ్యడం జరిగిందన్నారు. గంజా కి చెందిన 3 దాడుల్లో 5 గురుని అరెస్ట్ చేసి, రూ.3,61, 550 విలువైన సుమారు 50 కేజీల గంజా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Comments