తొలి అడుగుతోనే దబిడి దిబిడి.

 తొలి అడుగుతోనే దబిడి దిబిడి తెనాలి.  (ప్రజా అమరావతి );                                                                                                                                                                     తెనాలిలో  తొలి అడుగుతోనే అథికారపక్షానికి దబిడి దిబిడిని  ఇక ప్రభుత్వానికి ఆట మొదలైందని  అని TDP.  MP అభ్యర్థిాడాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.  గురువారం టిడిపి - జనసేన పార్టీల ఆధ్వర్యంలో  తెనాలిలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పెమ్మసాని తో పాటు నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్  ఆలపాటి రాజేంద్రప్రసాద్ లతో స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నుంచి నడక తో మొదలైన ఈ ప్రచారం పాత స్వరాజ్య థియేటర్ మీదుగా బోస్ రోడ్, గాంధీ చౌక్, షరాఫ్ బజార్ గుండా మున్సిపల్ కాంప్లెక్స్ వరకు సాగింది.

ప్రతిచోట వ్యాపారులు, యువత, మహిళలు, వృద్ధులు ఇరు పార్టీల నాయకులకు  ఆత్మీయ పలకరింపులతో ఈ రాక్షస ప్రభుత్వాన్ని  అంతం చేయాలన్న భావనతో  పలువురు అతమ మద్దతుగా ఉంటామంటూ  స్వాగతం  పలికారు.   

                                                                                                       పిదప  పెమ్మసాని మాట్లాడుతూ అ నుంచి అం, అ: వరకు జగన్ తప్పులు చేసుకుంటూ వెళ్లారని చెప్పారు. 'అ అంటే అంగన్వాడీలకు అన్యాయం, ఆ అంటే ఆరోగ్యశ్రీ కి ద్రోహం, ఇ అంటే ఇసుక దోపిడీ, ఉ అంటే ఉద్యోగాలు లేకపోవడం' వంటి ఎన్నో లెక్కలేనన్ని పాపాలు చేశారని తెలిపారు. చరిత్రలో ఈ ప్రభుత్వం మళ్లీ కనపడకుండా బదులు తీర్చుకుంటాము అని పెమ్మసాని చెప్పారు.


 అనంతరం మనోహర్ మాట్లాడుతూ ఈ చెత్త ప్రభుత్వం పోవాల్సిందేనని, దౌర్జన్యాలకు పాల్పడుతున్న జగన్ ప్రభుత్వాన్ని పారద్రోలాల్సిందేనని తెలిపారు. అలాగే ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ అతలాకుతలమైన ప్రజా జీవనాన్ని, ఈ రాక్షస రాజ్యం నుంచి విముక్తి కలిగించాలంటే పెమ్మసాని, మనోహర్ ను గెలిపించాలని ప్రజలను కోరారు.


 ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ కార్యకర్తలు ఇరు పార్టీల శ్రేణులతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు TDP జనసేన ఐక్యత వర్ధిల్లాలంటూ నినదించారు


Comments