యువత భవిష్యత్తు బాగుండాలంటేఅభివృద్ధికి ఓటు వేయాలి.

 తాడేపల్లి (ప్రజా అమరావతి);


*రాష్ట్రంలో గత ఐదేళ్లలో  యువతకు ఏమి ఉద్యోగాలు ఇచ్చారో జగన్ చెప్పాలి*


*రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టిడిపి, జనసేన,బిజెపి, ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావాలి*


*యువత భవిష్యత్తు బాగుండాలంటేఅభివృద్ధికి ఓటు వేయాలి**టీడీపీ గుంటూరు పార్లమెంటు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్*


*జంగాల వెంకటేష్ ఆధ్వర్యంలో పడవల మహేష్ బొర్రా అరవింద్ సహకారంతో యువతకు ఓటు పై అవగాహన*


*కె ఎల్ యూ యూనివర్సిటీ విద్యార్థులకు ఓటు పై అవగాహన కల్పిస్తున్న గుంటూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి  పెమ్మసాని చంద్రశేఖర్*


గత ఐదేళ్ల కాలంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యువతకు ఏమి ఉద్యోగాలు ఇచ్చారో  చెప్పాలని టిడిపి గుంటూరు పార్లమెంటు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశ్నించారు.రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు సీఎం అవడానికి గల ఆవశ్యకతను వివరిస్తూ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ‘‘మై ఫస్ట్ ఓటు టూ సీబీఎన్`’ ఈవెంట్ కార్యక్రమం

బుధవారం మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని వడ్డేశ్వరం  కేఎల్ యూనివర్సిటీ ఎదుట 

గుంటూరు పార్లమెంట్ తెలుగు యువత  ఉపాధ్యక్షులు జంగాల వెంకటేష్, ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ                                                                                                                                                                    మెజారిటీ సీట్లు ఇవ్వండి, పనిచేయకపోతే ప్రశ్నించండి.' అని టీడీపీ నాయకులు డా. పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కే ఎల్ యూ కాలేజీ ఆవరణలో బుధవారం జరిగిన 'ఫస్ట్ ఓట్ ఫర్ సీబీఎన్' విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమానికి పెమ్మసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువత చైతన్యవంతులైతే రాక్షస పాలనకు స్వస్తి పలికినట్టేనని, రూ. 5 వేల జీతాలకు వాలంటీర్ ఉద్యోగాలు చేతిలో పెట్టి, వేలకొద్దీ ఉద్యోగాలు ఇచ్చేసామని జగన్ చెప్పుకోవడం సిగ్గుచేటు అని టీడీపీ నాయకులు డా. పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లు కూడా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే మన అమరావతి కూడా హైదరాబాద్ తరహాలో అభివృద్ధి జరిగేదని పెమ్మసాని తెలిపారు. సమీప భవిష్యత్తులో  జగన్ కనిపించకుండా యువత ఓటు వేయాలని ఆయన యువతను కోరారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మీడియా కో - ఆర్డినేటర్ పాతూరి నాగభూషణం మాట్లాడుతూ మోదీ దగ్గరకు వెళ్ళి అమరావతి గురించి మాట్లాడగల తొలి వ్యక్తి పెమ్మసానేనని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత పడవల మహేష్, గుంటూరు పార్లమెంటరీ తెలుగు యువత జంగాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని అన్నారు. యువతకు ఉద్యోగా అవకాశాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు.యువత భవిష్యత్తు బాగుండాలంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే యువత ఆలోచించి ఓటు వేయాలని అన్నారు.ఓటు యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ.. ఓటు ఎలా వెయ్యాలి, ఎవరికి ఓటు వెయ్యాలి అనే అంశాల పైన మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువతకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఓటు హక్కు కలిగిన వారందరూ ఎన్నికల్లో తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు  ఆవశ్యకతను వివరిస్తూ

మై ఫస్ట్ ఓటు టూ సీబీన్ ’’ పేరుతో

మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకొనే వారికి అవగాహన కల్పించినట్లు తెలిపారు. తెలుగు యువత గుంటూరు పార్లమెంటు అధ్యక్షులు రావి పాటి సాయి కృష్ణ, ఉపాధ్యక్షులు  జంగాల వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటిసారి ఓటు వేసే యువత సుమారు 46 లక్షల మంది  ఉన్నారని రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే పార్టీని ఎన్నుకోవాల్సిన బాధ్యత  యువత పై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాతూరు నాగభూషణం రాష్ట్ర తెలుగు మహిళ నాయకురాలు ఆకుల జయసత్య, తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మంచి కలపూడి వైష్ణవి,తెలుగు యువత మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు పడవల మహేష్,తెలుగు యువత నియోజకవర్గ ఉపాధ్యక్షులు

షేక్ ఖాసింబాబు,బొర్రా అరవింద్, రాయపూడి కిరణ్, మహమ్మద్ షఫీ,అమరా సుబ్బారావు, సామల నాగేశ్వరావు,కొల్లి శేషు,కంభపాటి శిరీష,దర్శి హరి కృష్ణ,

తదితరులు పాల్గొన్నారు.

Comments