సిఎస్ ఆర్ కార్యకలాపాలు విస్తృతంగా కొనసాగించాలి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు.

 సిఎస్ ఆర్ కార్యకలాపాలు విస్తృతంగా కొనసాగించాలి

జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబుపుట్టపర్తి, మార్చి 30 (ప్రజా అమరావతి): ప్రభుత్వ రంగ సంస్థలు, కంపెనీలు ఇచ్చే సి ఎస్ ఆర్ విరాళాల లలో కొంత భాగాన్ని ఆయా కంపెనీలు కొలువై ఉన్నచోట కొంతమేర ఖర్చు చేయాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని ఆయన చాంబర్ నందు కియా కంపెనీ అనుబంధ సంస్థ Hyundai Mobis కంపెనీ ప్రతినిధులు జిల్లాలోని వివిధ అంగన్వాడి కేంద్రాలలో రూ 44,13,436 ల విలువగల పరికరాలు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు కు అందజేశారు. ఈ కార్యక్రమంలోPlant Head: Mr.HUH MIN HO.Factory Manager: PN Srinivas. తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐ సి డి సి పిడి లక్ష్మీ కుమారి మాట్లాడుతూ జిల్లాలో వివిధ అంగనవాడి కేంద్రాలలో పిల్లలు ఏ వయసులో ఎంత బరువు ఉండే మిషన్ 2741, Infantometer 600, పెద్దల బరువు కొలమానం600,  స్టేడియో మీటర్ 600 అందజేశారని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కొండయ్య, కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు


Comments