సువిధ లో అందిన 2129 అభ్యర్ధనలు పరిష్కారం...



 *ఇంతవరకు రూ.13.74 కోట్ల విలువైన నగదు,బంగారం,వెండి, మద్యం,ఇతర వస్తువులు సీజ్...* 


 *సువిధ లో అందిన 2129 అభ్యర్ధనలు పరిష్కారం...* 



  *జిల్లా ఎన్నిక‌ల అధికారి,జిల్లా కలెక్టర్ వె ప్రసన్న వెంకటేష్.* 


ఏలూరు,ఏప్రిల్ 24 (ప్రజా అమరావతి):సార్వత్రిక ఎన్నికల నేపద్యంలో ఇఎస్ఎంఎస్  కింద చేబట్టిన సీజర్ మేనేజ్మెంట్ ప్రక్రియ ద్వారా ఎన్నికలు కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకూ జిల్లా వ్యాప్తంగా మొత్తంగా రూ.13.74 కోట్ల  విలువైన నగదు,బంగారం,మద్యం,ఇతర వస్తువులు సీజ్ చేశామని జిల్లా. కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ తెలిపారు.  ఇందులో రూ.206.35లక్షలు నగదు కాగా, రూ.10.17 కోట్ల విలువైన  బంగారం, వెండి ఆభరణాలు మరియు రూ.143.24 లక్షల విలువైన మద్యం స్వాధీన పరచుకున్నారు. జిల్లాలో ఎన్నికల ప్రచార అనుమతుల కోసం సువిధ /ఎన్ కోర్ ద్వారా అందిన అభ్యర్ధనలలో ఇంతవరకూ 2129 అనుమతులు ఇవ్వటం జరిగిందన్నారు. ఎన్నికల ప్రచార అనుమతుల కోసం సువిధ ద్వారా 2167 అభ్యర్ధనలు రాగా వాటిలో ఇంతవరకూ 2129 అనుమతులు జారీ చేయగా మరో 38 పరిశీలనలో ఉన్నాయన్నారు. సి-విజిల్ ద్వారా 410  ఫిర్యాదులను పరిష్కరించామన్నారు మీడియాలో ఎన్నికల ఉల్లంఘనలకు వచ్చిన 106 ఫిర్యాదులు పరిష్కరించామన్నారు. ఎన్ జి ఎస్పీ పోర్టల్ ద్వారా 643 పిర్యాదులు స్వీకరించగా వాటిలో 638 పరిష్కరించబడ్డాయని మరో 5 పరిశీలనలో ఉన్నాయన్నారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున్న ప్రజలు నగదు గాని ఇతర విలువైన వస్తువులు గాను ప్రయాణ సమయంలో తీసుకువెళ్ళే సమయంలో అందుకు సంబంధించి సరియైన ఆధార పత్రలను  తమ వద్ద ఉంచుకోవలన్నారు. 


Comments