నేడు అన్ని జిల్లాల్లో 65.69 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్‌ పంపిణీ ప్రారంభమైంది.


విజయవాడ,3 ఏప్రిల్ (ప్రజా అమరావతి):


పెన్షన్‌దారులకు శుభవార్త! నేడు అన్ని జిల్లాల్లో 65.69 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్‌ పంపిణీ ప్రారంభమైంది. 


ఈ మేరకు ప్రభుత్వం రూ.1951.69 కోట్లు విడుదల చేసింది. 


ఈనెల 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు అందరు పెన్షన్‌దారులకు సాఫీగా పెన్షన్‌ అందేలా జిల్లా కలెక్టర్లు ఏర్పాట్లు చేశారు. 


మొత్తం 14,994 గ్రామ/వార్డు సచివాలయాలకు గాను 13,669 సచివాలయాల్లో  పెన్షన్‌ పంపిణీని ప్రారంభించి బుధవారం 25.66 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు.


ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉన్న,వృద్ధులు, వికలాంగులు వంటి నాలుగు విభాగాల పెన్షన్‌దారులకు తప్పనిసరిగా ఇంటి వద్దే పెన్షన్‌ అందించాలనే  నిబంధనలను సవరించడం జరిగింది.

 ఈ విభాగాల పెన్షన్‌దారులు సచివాలయాలకు రానవసరం  లేకుండా ఇంటి వద్దే పెన్షన్‌ అందజేస్తారు.అందుకు సంబంధించి ప్రభావవంతమైన కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్లను కోరాం..


వేసవి ఎండలు దృష్ట్యా ( గురువారం)నుంచి ఉదయం 7.00 గంటల నుండి గ్రామ/వార్డు సచివాలయాలు పెన్షన్‌ పంపిణీని ప్రారంభించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాం.


          

Comments