బెదిరింపులకు భయపడేది లేదు, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది.

 *బెదిరింపులకు భయపడేది లేదు, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది*అమరావతి (ప్రజా అమరావతి);

ఎన్డీఏ కూటమిలోని జనసేన పార్టీ నాయకులు బెదిరిస్తే బెదిరిపోం అని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డి నాగేశ్వరావు అన్నారు. ఆదివారం మంగళగిరి నగరంలోనీ ఐబీఎన్ భవన్  ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన  మాట్లాడుతూ  జనసేన పార్టీ నాయకులు ఎంపీ బాలశౌరి విజయవాడ ఐలాపురం హోటల్ దగ్గర  మాట్లాడటానికి పిలిచి తన అనుచరులతో  గన్ తో బెదిరించి పది బి ఫారం లు తీసుకువెళ్లారని ఆరోపించారు. తమ పార్టీ ఎన్నికల గుర్తు బకెట్ వచ్చిందని, దీనివలన జనసేనకు నష్టం కలుగుతుందనే దురుద్దేశంతో బెదిరిస్తున్నారని విమర్శించారు. బెదిరిస్తే బెదిరిపోమని తెలిపారు. ఈ మేరకు విజయవాడ గవర్నర్  పేట పోలీస్ స్టేషన్లో, డీజీపీ కార్యాలయం లో డీజీపీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. వెంటనే ఎన్నికల కమిషన్ స్పందించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి డి వెంకటేశ్వరరావు, జి రామారావు, షేక్ బాషా, షేక్ మస్తాన్,  సయ్యద్, ఎస్.కె గబ్బర్ తదితరులు పాల్గొన్నారు.

Comments