మాదిగలను నమ్మించి మోసం చేసిన వైఎస్ జగన్ కు బుద్ధి చెబుతాం.

 *మాదిగలను నమ్మించి మోసం చేసిన వైఎస్ జగన్ కు  బుద్ధి చెబుతాం*



 *నారా లోకేష్ ను లక్ష ఓట్లుతో గెలిపించుకుంటామని ఎమ్మార్పీఎస్ నేతలు వెల్లడించారు*

మంగళగిరి (ప్రజా అమరావతి);

*ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కార్పొరేషన్ లకు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా నిరుద్యోగ యువతకు ఉపాధి లేకుండా లీడ్ క్యాప్ సంస్థను కూడా నిర్వీర్యం చేసి ఐదు సంవత్సరాలు కొనసాగిన వైయస్ జగన్ ప్రభుత్వాన్ని ఓడిచ్చి మాదిగల సత్తా చూపిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంకటేశ్వరరావు మాదిగ హెచ్చరించారు*


*వైయస్ జగన్మోహన్ రెడ్డి మాల, మాదిగలను, జెండాలు మోసే కూలీలగానే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు*.


*29 ఎస్సీ రిజర్వాడ్ స్థానాలలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాదిగలకు 15 స్థానాలు కల్పించి సమన్యాయం చేశారని ఆనందం వ్యక్తం చేశారు*


మాదిగలను నమ్మించి మోసం చేసిన వైఎస్ జగన్ కు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని మాదిగ సంఘాల జేఏసీ అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరావు మాదిగ హెచ్చరించారు. మంగళగిరి నగరంలోని ఐబీఎన్ భవన్ ప్రెస్ క్లబ్ నందు మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ సార్వత్రిక ఎన్నికలలో మాదిగలకు సమ న్యాయం పాటించి 15 సీట్లు కేటాయించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కే మా మాదిగల మద్దతు అని అన్నారు. మంగళగిరి నియోజకవర్గం నుండి  పోటీ చేస్తున్న నారా లోకేష్ ను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకుందామని పేరుపోగు వెంకటేశ్వరావు ధీమా వ్యక్తం చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించి 27 ఎస్సీ పథకాలను రద్దు చేసిన  మాదిగలు ఓట్లు ఎందుకు వేయాలో వైయస్ జగన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టులో మాదిగల తరఫున వైసీపీ ప్రభుత్వం ఒక్క లాయర్ను కూడా పెట్టకుండా మాదిగల వ్యతిరేకంగా మారిన వైయస్ జగన్ ఈ ఎన్నికల్లో భూస్థాపితం చేయాలని వెంకటేశ్వరరావు మాదిగ అన్నారు.ఎస్సీ లను మాదిగ, మాల, రెల్లి, కార్పొరేషన్లు చేసి ఆ కార్పోరేషన్లకు రూపాయి కూడా చెల్లించకుండా మోసం చేశారని మండిపడ్డారు. ఈ ఐదేళ్లలో ఎస్సీ కార్పొరేషన్ కి ఒక పైసా నిధులు కేటాయించకుండా లిడ్ క్యాప్ ను నిర్వీర్యం చేసిన వైయస్ జగన్ ను ఈ ఎన్నికల్లో మాదిగలు ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ మీడియా సమావేశంలో మాదిగ సంఘాల నాయకులు జె ప్రకాష్, కొదమల బెంజిమెన్,   పొన్నగంటి రమేష్, వేజెండ్ల సుబ్బారావు, కటివరపు కోటేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.

Comments